Wednesday, January 23, 2013

దేవుడు, మతం మరియు కమల్

"నాస్తికులుగా మాట్లదకండి. ఊరంతా మంచివాళ్ళే ఉన్నారు. వాళ్ళంతా దేవుళ్ళే" -సత్యమే శివం
"దేవుడుంటే బాగుండు..దేవుడు లేదని నేనేక్కదన్నాను??" -దశావతారం.

పై రెండు సినిమాలకు కథ, స్క్రీన్ ప్లే కమల్ అందించాడు. దేవుడు , మతానికి సంభందించిన అనేక విషయాలను చక్కగా చర్చించిన సినిమాలు. ఎక్కడ దేవుడి పై గాని, భక్తుల పై గాని, మాతాల పై గాని అసందర్భ విమర్శ లేని సినిమాలు. అదే సమయం లో తర్ఖిక ప్రశ్నలు లేవనెత్తి చర్చిస్తాడు (దశావతారం లో శైవ. వైష్ణ మతాల మధ్య ఒక సమయం లో ఉన్న వైరం, దాన్ని మూర్ఖంగా నమ్మిన ఇద్దరు స్నేహితుల వైరం, అవి నేటి సమాజానికి ఎంత అనవసరం అయ్యయో, ఎలా కొట్టుకుపోయాయో చెపుతాడు, అలానే సత్యమే శివం లో ఇద్దరు భక్తులు -నాజార్, మాధవన్ మధ్య నడిచిన ఒక నాస్తికుని, కమ్యునిస్ట్ భావజాలం ఉన్న ఒక వ్యక్తీ, అతని లో వచ్చిన మార్పు, అదే ఇతరులను ప్రేమ గా చూసే గుణం, దాన్నే దైవం అని చెప్పే ప్రయత్నం)
కమల్ గొప్ప నటుడు మాత్రమె కాదు. ఒక గొప్ప వ్యక్తిత్వం, గొప్ప ఆలోచనలు గల వ్యక్తీ. ఆతను ఒక నటుడు గానే కాదు, ఒక కొత్త ఆలోచనలను ప్రభావం చేయగల వ్యక్తీ గా మన సమాజానికి ఏంటో అవసరం. ఇప్పుడు సినిమాని ఆపేయమని గొడవ చేస్తున్నది..ఒక మతం వాళ్ళు గా కాకుండా.., మతాన్ని అడ్డుపెట్టుకొని ప్రచారం పొందాలని చుస్తున్నవారిగా అర్థం చేసుకోవాలి. ఇలా సినిమా ని ఆపటం వాళ్ళ, జరిగే ప్రయోజనం ఏమి లేదు. చూసేవాళ్ళు కచ్చితంగా చూస్తారు. ఇప్పుడు అనేక సాధనాలు.  కమల్ కి, నిర్మాతలకి (తన కుటుంభానికి) అది ఆర్థిక నష్టం తెస్తుందేమో కాని ఆతను చెప్పాల్సిన విషయాన్ని కచ్చితంగా చర్చకు వస్తుంది.అదే అతని ప్రయత్నం కనుక, అతడు సినిమా కి ముందే ఆ పని చేయగలిగాడు.

2 comments:

neo said...
This comment has been removed by the author.
neo said...

వంశీ , కమల్ మిమ్మల్ని ఎంతగా ప్రభావితం చేసాడో మీ బ్లాగ్ చూస్తేనే అర్ధం అవుతుంది. విశ్వరూపం ఆపిన వాళ్ళు కమల్ ఆలోచన అర్ధం కాని వాళ్ళు మాత్రమే కాదు, అసలు అర్ధం చేస్కోవాలని లేని వాళ్ళు. అలాంటి వాళ్ళతో కూడా ఓర్పుతో చర్చలు జరిపి వాళ్ళకి అర్ధం చెప్పే ప్రయత్నం చేస్తాను అనడం కమల్ ఔన్నిత్యానికి ప్రతీక .