Wednesday, November 27, 2013

వదలని JK “ముందున్న జీవితం”

 “ఈ రోజు నుండి దేవుణ్ణి నమ్మదల్చుకోలేదు.!”
సాయంత్రం పరివార్ ధాబా కు వెళ్తూ ఎదో ఎవరో అమ్మయిలగురించి సరదాగా మాట్లాడుతూ వెళ్తున్న మా మిత్ర త్రయం తో పూర్తి అసందర్భంగా, అసంకల్పితంగా నేనన్న మాట. 
“ఏంట్రా ఏమన్నావ్??
...
“అయితే మాకేంటి..ఇప్పుడెందుకు సడన్ గా గుర్తొచ్చింది.!”
....
“అవునన్నా! కాలేజ్, హాస్టల్ వదిలేసి వెళితే, ఎలా ఉంటామన్నా?? జాబ్ లో బిజి అయిపోవడం.....” శ్రికరన్న తో శ్యాం ఎదో మాట్లాడుతూ ఉన్నాడు..నేనన్న మాటనే కాదు, నన్నే పట్టించుకోవడం మానేసారు.. నడక సాగుతూనే ఉంది.! 
అవును.., అప్పుడెందుకు అలా అన్నాను.! ఏమి ఆలోచిస్తు ఉండుంటాను ??
అవంచనియంగా ఆ క్షణం లో అన్న కుడా ఇప్పుడు తెలుస్తోంది, ఆ క్షణం గొప్పతనం.!

---------------------

మనలో మన ఆలోచనలలో కలిగే మార్పులకు ఒక “ఇండికేటర్” కావాలంటే దొరకదేమో ! అది మెల్లిగా, అతి మెల్లిగా, చాల నిదానంగా మొదలవుతుందేమో.! కాని అందులో ఎదో ఒక క్షణం అంతటికి కారణభూతమై నడిపిస్తుంది.
అలాంటి క్షణం ఏదైనా చెప్పలంటే నేను ముందు చెప్పిన క్షణా౦. అందుకు ఉసిగొల్పిన కొన్ని కారణాలు..
అవి నిజానికి డ్రమాటిక్ కాకపోవచ్చు..కాని నాకు సంబంధించి నా జీవిత గమనానికి పెద్ద మార్పులు..

------------------
చినప్పడినుంది పుస్తక౦ అంటే వ్యామోహమే.! స్కూల్ పుస్తకాలు కాదు..కథల పుస్తకాలూ.  అరటి పండ్ల ను చుట్టి తీసుకొచ్చిన పేపర్ కూడా చదివెంత పిచ్చి ఉండేది చినప్పుడు. హాస్టల్ వదిలి, హాలిడేస్ లో ఇంటికి వెళ్ళగానే పాత పేపర్ కట్టలు ముందు వేసుకొని, అందులో కథలు (ఈనాడు మూడో పేజిలో వచ్చే బొమ్మల కథ, కార్టూన్లు, సండే వచ్చే ఇది కథ కాదు లాంటివి) చదివే వాడిని..అప్పట్లో సుల్తానాబాద్ లోని (కరీంనగర్ జిల్లా), శాఖ గ్రంథాలయం లో పిల్లల పుస్తకాలు మొత్తం చదివేసాను.
అలా ఏది పడుతూ అది చదువుతున్న సమయం లో, కథ ల పుస్తకాలు దాటి సీరియస్ పుస్తకాలు చదవాలని అనిపించేట్టు చేసింది “ముందున్న జీవితం”.
బి.ఎస్సి.(అగ్రికల్చర్) మూడో సెమిస్టర్ చదువుతూ, రెండో సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తున్న టైం లో, అప్పటికే ఉన్న గ్రేడ్ పాయింట్ పెంచుకోవాలని
, చదవడానికి తెగ ప్రయత్నిస్తున్న కాలం లో, ఈ పుస్తకం ఒక మిత్రుని ద్వార దొరికింది. పుస్తకం కోఠీ లో తీసుకోని, రాజేంద్ర నగర్ వచ్చి మొదలుపెట్టి చదువుతూ ఉండిపోయాను. ఒక్క రోజు కాదు, ఒక వారం. రేపు పరిక్షలు అన్నరోజు వరకు.    
మొదటి కొన్ని పేజీలు తిప్పగానే అర్థం అయింది, “ఇతన్ని అర్థం చేసుకోవాలంటే మనల్ని మనం (బుర్రలను) పూర్తిగా ఖాలీ చేసుకొని చదవడం మొదలు పెట్టాలని”. ఒక పేరా చదవడం, ఆ తరువాత ఆలోచనలలో మునిగిపోవడం, ఆశ్చర్యపోవడం, మల్లి అలోచ్చించడం, ఒక నిర్ణయానికి రావడం, మల్లి చదవడం..
మిగితా పుస్తకాలలో ఉన్నది, జిడ్డు కృష్ణముర్తి పుస్తకం లో మాత్ర౦  కనపడనిది..,”సూత్రాలు, సూక్తులు, మంచి మంచి సలహాలు”..అవును, అతని పుస్తకాలలో మిగితా గురువులు చెప్పే సూత్రాలు, సూక్తులు ఉండవు. (నాకు అర్థం అయ్యింది, ఆ తరువాత నన్ను అత్యదికంగా ప్రభావం చేసింది, అదే!).  జిడ్డు కృష్ణమూర్తి ప్రతి ప్రశ్న కు సమాధానం నిన్నే వెతుక్కోమంటాడు. నీకు సమాధానం దొరకడం విలు కాకపొతే, మనం ఇద్దరం కలిసి ప్రయత్నిద్దాం అంటాడు. అల వెతికే క్రమం లో పై, పై పొరలు తొలిగిపోతుంటాయి.  ఒక దేశం, మతం, ప్రాంతం, చుట్టూ ఉన్న సమాజం ఎప్పుడో ఏర్పరిచిన మాయ చట్రాలు ఎవైన ఉంటె అవి దాటి ఆలోచించేలా మనకు తోడ్పడుతాడు. సత్యాన్వేషణ లో అసలైన దారి చుపెడతాడు. సమస్య లకు, సంక్లిష్టాలకు, అనుమానాలకు మనం గురువులను, సమాదాన పరిష్కారాలను చుపెవారి కోసం వెదుకుతూ ఉంటాం. కాని వాటిని నీలో సృస్టించు కొన్నది నివే కనుక, నీకు నివే గురువు అయి సమాధానం వేడుక్కోవాలంటాడు. అందుకని సమస్యలతో, నీతో, నీ పక్కవల్లతో, నీ స్నేహితులతో, బంధువులతో, మన ఆశలతో, వారి ఆశలతో ఉన్న బందాలను అర్థం చేసుకొంటే ఈ క్లిష్టత తోలిగిపోతుందంటాడు.   

సత్యాన్ని అన్గికరించకపోవడమే “భయం” అని చదవగానే, నాలో ఉన్న ఎన్నో భయాలు తోలిగిపోవడం మొదలయింది. భయాలకు మనం వేసుకొన్న ఎన్నో ముసుగు లు (అందులో స్వర్గం, నరకం, దేవుడు కుడా ఉన్నాయి) కనపడడం మొదలయింది.   
మనలో ఉన్న జ్ఞానం, అనేక జ్ఞాపకాల సమాహారం. చదువుకొన్నది, చూసింది, మన మతం మనతో చెప్పింది, మన దేశం గురించి మనం విన్నది, మన పెద్ద వారి నుండి మనకు వచ్చింది, ఆచారాలతో పాటు వచ్చింది..ఇలా అనేకం. ఇవే మనకు ముందుండి మనల్ని నడిపిస్తాయి. కాకపొతే మనకు ఎదురయ్యే కొత్త, కొత్త సవాళ్ళకు, పాత సమాధానాలే ఇవ్వి చుపగాలుగుతాయి. ప్రతి సమస్యను మన జ్ఞాపకాలతో, అనుభవాలతో ముడిపెడుతూ, అలవాటైన పద్దతిలోనే పరిష్కరించటానికి చూస్తుంటాం. కాని సమస్య లోనే, ఒక కొత్త సమాదానం ఉందేమో, కొత్త దారిలో వెడితే ఎలా ఉంటుందో, మన ఈ సమస్యలకు పాత అనుభవాల ముసుగులు ఎలా అడ్డం పడుతాయో అలోచిన్చుకోమ౦టాడు.
ఇది ఇప్పుడు నాకు కలిగిన అభిప్రాయం. అదే అభిప్రాయం ఎల్లా కాలం ఉండాలని తను చెప్పలేదు. అసలు తను చెప్పింది మాత్రమె కరెక్ట్ అని అనలేదు. మనల్ని ఆలోచించుకోమన్నాడు.
---------------------

అలా జిడ్డు కృష్ణమూర్తి పుస్తకం ” ముందున్న జీవితం” (లైఫ్ ఆహేడ్ అనే ఇంగ్లిష్ పుస్తక అనువాదం), నా ఆలోచన విధానాలను మార్చింది. అన్ని విషయాలలో  నాదైన సమాధానం వేదుక్కోవడానికి ఉపయోగపడింది. అవి కచ్చితంగా నా జీవన విధానం లో మార్పులు తీసుకువచ్చింది. దేవుడు గురించి ఆలోచించటానికి ఎక్కువ రిసెర్చ్ చేశాను, దొరికిన పుస్తకాలూ చదివాను. నేన్నిన్ని రోజులు “దేవుణ్ణి” నమ్మడానికి గల కారణాలను ఒక సారి పరిశీలించాను. అవి అన్ని పూర్తీ తప్పు కారణాలని అర్థం అయ్యింది. నాకు మరో కారణం దొరికేవరకు అన్వేషిన్చాలనుకొన్నాను. అలా అదే ధ్యాసలో ఆలోచిస్తూ, అప్పుడు ఆరోజు సడన్ గా అలా నిర్ణయించుకొన్నాను. అప్పటినుండి ప్రతి ఒక్కటి కొత్తగా కనిపించడం మొదలయింది. చాల వాటి మిద భయం పోయింది. నా వ్యక్తిత్వ నిర్మాణానికి, అది బయట వారికి వ్యక్తీకరించే పద్దతి మారింది.


ఆ రోజు నుండి ఇప్పటికి ఆ పుస్తకం నన్ను వదిలిపోలేదు. నేనే కాదు, నా ద్వార వెళ్ళిన ఎంతో మందిని అది వదిలి వెళ్ళదు.

Wednesday, November 6, 2013

మరో వందేళ్ళ కోసం పదేళ్ళ ప్రయాణం (నా పెళ్లి రోజుకో కవిత)

"కవితలు రాస్తానని చెప్పుకొంతావ్, ఎప్పుడు కొత్తది రాయగా చూళ్ళేదు" అన్న మా ఆవిడ కోసం, తన మొదటి (నా ఆవిడ గా ఆమె మొదటి) పుట్టిన రోజు నాడు రాసి ఇచ్చిన బహుమతి.. జాగ్రత్తగా దాసుకొన్న ఆ కాగితాన్ని వెదికి, ఇక్కడ పోస్ట్ చేస్తున్నా.! ఈ రోజు తో మా పెళ్లి జరిగి పదేళ్ళు. సందర్భానుసారం మరో సారి ఆమెకు ఇ- వెర్షన్ చూపించొచ్చు కదా. (కొన్ని మార్పులతో)!

పాదం కలిసినంత మాత్రాన నడక కాలేదు
మాట కలిపినంత మాత్రాన  పాట కాలేదు

వయసు బాట లోన కదిలిన వలపు అడుగులై,
కడలి అలలపై తేలిన నీటి బుడుగాలెన్నో
చెదిరిన ఆ గురుతులతో నీకై వేదుకులాటలెన్నో

నా నడకలో అడుగు అవుటకు
నా పాట లో మాట లు అల్లుటకు
నన్ను నన్ను గా ప్రేమెంచుటకు
నీకై వెదికినా గడపలెన్నో

ఏనాల్లో వేచిన హృదయం
ఒకటై కలిసిన ఉదయం
మనసే కావ్యమై,  మాటలు కరువై
ఒకరికి ఒకరు చేసుకొన్నా ప్రేమ ఒప్పందం

పదేళ్ళ పరుగులో
"ఇంతేనా", "ఇంతనా"
నేనింతే, నువ్వింతే
సర్డుకోవడమా, సర్దుకు  పోవడమా
చిరాకో పక్క, లెక్కలు మరో పక్క

నేనో ఉహల చిత్రాలతో ఉన్న చిక్కు ముడిని
తానో హద్దులు దాటని సరళ రేఖ (ఆమె పేరు రేఖ)
కాని...
ఇలా కాకుంటే..అని అలోచిన్చలేనంత
ఎవరు మారారో తెలుసుకోనంత
అద్భుత ప్రయాణం, మొదటి మైలు రాయి ని దాటి
ముందుకెలుతూ వెనక్కి చూసి మురిసిపోయే౦తా

(నన్ను నన్ను భరిస్తున్న నా జీవన రేఖ కోసం)