Monday, June 27, 2011

కాపీ మాట

నేను నీ ప్రేమ లో మునిగిపోయాను. ఎంతగా అంటే ఈ ప్రపంచాన్ని పట్టిచుకోనంత, నీ తో సహా ...
అర్థం కాలేదా.., నేను నీ కంటే, నీ పై ఉన్ననా ప్రేమనే ఎక్కువ ప్రేమిస్తాను.
I love you so much... so much so that, nothing can matter to me..,not even you..

Thursday, June 23, 2011

సత్యమే శివం

దోచుకున్నవాడు దొంగ కాదు., దోచున్కున్నది దాచుకోన్నవాడు దొంగ కాదు. దొంగతనంగా దాచుకొన్నది పంచుకోన్నవాడు మాత్రమే దొంగ. ఇప్పుడు కోతగా లెక్క పెడుతుంటే , ఇన్నాళ్ళు లెక్క చెప్పని వాడిది తప్పు లేదు. భారత ప్రబుత్వానికి బాద్యత లేదు. అపారమైన నల్ల ధనం, రాజ భోగాలు. మీ నమ్మకం విలువ ఏంటో ఇప్పుడైనా తెలుసుకోక పోతే, ఇక నమ్మకం అనే దానికి విలువ అక్కర లేదు, మన నమ్మకాన్ని అసలు మనం నమ్మనక్కరలేదు. ఎవరో చెపితే, ఎవరో అనుసరిస్తే, మనవాళ్ళందరూ నమ్మితే మనం నమ్ముదాం.

Thursday, June 2, 2011

ఆదివారం రంగోలి

AG కాలేజీ, రాజేంద్ర నగర్, బి హాస్టల్ లో ...టిఫిన్ అయిపోతుందంటే ఎ ఎనిమిది, తొమిది గంటలకో లేచేది, సండే మాత్రం పొద్దున ఆరు గంటలకే లేచి, సెవెన్ హిల్స్ లో టీ తాగి, టివి రూం లో సెటిల్ అయ్యి DD లో (దూర దర్శన్ - అదృష్టం బాగుండి, అ ఒక్క ఛానల్ మాత్రమే వచ్చేది, ఇది 94-98 లో మాట) రంగోలి చూస్తుంటే ఆహ, ఆ మత్తు ఆ వారమంత ఉండేది. పాత హిందీ పాటల పరిచయం నాకు అక్కడే. ఎన్ని కాస్సేట్ట్స్, ఎన్ని సాంగ్స్... ఒక్కో సాంగ్ రోజుకు పది సార్లు విని, ఇరవై సార్లు పాడుకోని, వందల సార్లు ఆహ అనుకోని..ఆహ! పాటల్ని ప్రేమించి, అనుబవించి, పాటల్నోని ప్రేమని అనుబవించడానికి, అమ్మాయిల్ని ప్రేమించి, ఓహో!! అప్పుడప్పుడు సాయంత్రం హాస్టల్ పైన, పార్టీలలో విరహ గీతాలు, శ్యాం గాడి తెలుగు ప్రేమ గీతాలు (కొందరి కోరిక మేరకు), వాటిలో నంజుకోవడానికి గిల్బీస్ గ్రీన్ లేబిల్. ఇదంతా గుర్తుకు వచ్చి గూగుల్ లో వెదికితే మంచి పాట దొరికింది. క్రింద ఇచ్చిన పాట క్లిక్ చేసి చూడండి, మీరు ఎంజాయ్ చేస్తారు.
http://www.youtube.com/watch?v=lhxG1NMZITI