Friday, September 16, 2011

వంశీయం

"హద్దుల మద్యన ఒదగని, వశీకరణలకి లొంగని...వంశీయం"!!!
అతి తక్కూవ పదాల్లో, అద్భుతమైన వ్యక్తిత్వ వ్యక్తికరణ ....
నా మీద నీకున్న అభిప్రాయానికి దగ్గరగ జరగాలనే ప్రయాణం!!
నా పేరుకు నీ పదాలే టాగ్ లైన్ కావాలని నా ప్రయత్నం
నా పుట్టిన రోజు కి కే. శ్రీను పంపిన గ్రీటింగ్స్ లోని కొటేషన్ ..
దానిపై నా రియాక్షన్

Thursday, September 8, 2011

పోరాటం పై పోరాటం


"అవినీతి పోరాటం" పై అలుపెరుగని "పోరాటం" చేస్తున్న మేదావుల ఆంతర్యం అసలు అర్దం కావడం లేదు. ఈ పోరాటాలు, వాటి తీరు నచ్చలేదు, ఇలా కాదు ఇలా చేయలి అంటే విషయం అర్దం అవుతుంది. కాని వాటిని, చేస్తున్న వారిని అంతగా "అసహ్యించుకోవల్సిన" అత్యవసర ఆగత్యం, దాని "అంతర్యం" అర్దం కాలేదు. అరుందతి రాయ్ మట్లాడిన, అరుణ రాయ్ మాట్లాడిన, అన్నా చెప్పిన, ఎవరెవరు ఏది చెప్పిన వారు చూపిన, చూపిస్తున్న కల, అశయం చాలమందికి స్పుర్తిని ఇచ్చిన మాట వాస్తవం. టి. వి,. లో ఆ తతంగం చూసినపుడు నేను నవ్వుకొన్న మాట నిజం కావచ్చు. "మానవ హక్కులే", అవినీతి కంతె పెద్ద సమస్య అని నమ్మినవాడినే. కాని ఇలా అర్జంటుగా విరుచుకుపడి విషం చిమ్మలేదు. "మద్య తరగతీ ని ఒక మూర్కపు సమజానికి ప్రతి రూపంగ, అత్యాసపరులైన అవకాశవదులుగా, చిత్రీకరించడం మహ మేదావులకు అలవాటైపొయింది. ఈ విమర్శలలో మరో కోణం "నా/ మా పోరటాలు మత్రమే మీరు చేయలి, మీరు మరేది చేసిన అది కూహన స్వార్దమే" అనడం.. ప్రతి ఒక్కరికి తెలివి లేని దద్దమైన సరే, వాడికి నచ్చే పొరాటనికి మద్దతు ఇచ్చే కనిస హక్కు ఉంది.

తిరిగి వచ్చిన ప్రేమ టపా

అందుకే నీవంటే ప్రేమ!
..బాధపడటం అంటే ఏంటో తెలిసింది నీ వల్లే
-ఆ బాధలో కూడ ఓ ఆనందం ఉంటుందని తెలిపింది నీవే!

నిజానికి నేనామెను మర్చిపోయి ఉండేవాన్నేమో..,
ఆమె నన్ను గుర్తుపెట్టుకుందని తెలియకపోతే !

తెలుసు! నిన్నింక తలుచుకోవడం సామాజిక నిషిద్దం
నిన్ను మరిచిపోవడం .., అబ్బో అదో మానసిక యుద్ధం!