Thursday, September 27, 2012

మంచి తనం మించిన దొరకదు...


అందరిలో దైవం చూస్తూ, తనే దేవుడు అనుకొనే శివుడు (పాగల్ లో కూడా దేవుడు ఉంటాడనే పాగల్)
హిరో మిద అభిమానాన్ని , పేదలకు సేవ చేసే విధి గా మార్చుకొన్న చెరుకు బండి నూర్
పాత పురాణ సినిమాల్లో (అలంటి సినిమాలలో సినిమా కష్టాలు అతిగా ఉంటాయని..) కూడా చూడని కష్టాలను దాటి, క్షమా, ప్రేమ పంచుతూ పది మందికి ఆశ్రయం ఇచ్చిన అస్రఫ్ షరీఫా
పేదరికం తో పారిపోయి వచ్చి వంద మందికి అన్నం పెట్టగలిగిన ఎత్తుకు ఎదిగిన బాబురావు
"కలాం" గారి స్పీచ్ విని కొత్త జీవన శైలి తో ఎదుగుతున్న దిలీప్
పది రూపాయలకే అన్నం పెట్టి, తిన్న వాళ్ళను దేవులనుకొనే భారతమ్మ ..
ఇలాంటి వారు ఎందఱో..ఒక్కక్కరు ఒక పుస్తకం, పేదరికం అడుగున జీవిస్తూ, అద్భుతమైన వ్యక్తిత్వం తో మన చుట్టే తిరుగుతున్నా దేవుళ్ళు... మంచితనం చచ్చిపోయిందనే ఇసురోమనే మనుషుల మేధ కు ఆవల నిలిచిపోయిన వాళ్ళు..
"కందుకూరి రమేష్ బాబు" గారు ప్రచురించిన(సాక్షి, కౌముది లలో) కొన్ని వ్యాసాలలో బయటపడ్డ మేలి ముత్యాలు
http://samanyashastram.org/index.html  లో వెళ్లి "ప్రొఫైల్" వెదకండి

Wednesday, September 5, 2012

నా గురువు.., మా తాత

"తొమ్మిదో ఎక్కం చెప్పు"
"తొమ్మిది ఒక్కట్లు ..."
"ముందు నుంచి కాదు, వెనక నుంచి.."
..........
"sare...ముందు నుంచి చేపతనంటే పదమూడో ఎక్కం చెప్పు"
"పో నేను చెప్పను.. ఎవరియన మూడో తరగతిలో పదమూడో ఎక్కం చెపుతారా.."
..రాజమౌళి సారూ మనవడు చెప్పాలి..ఆ రాజమౌళి సారు మనవడిని నేనే..మొదటి తరగతి మొదలు పెట్టనప్పడి నుండి అయన దగ్గరే పెరిగాను. (అమ్మమ్మ దగ్గరే అయిదవ తరగతి వరకు చదివా). నా గురువు, మెంటర్, రోల్ మోడల్ అన్ని ఆయనే.  పేరుకి అతుక్కుపోయిన "సారూ" అనే మాటకు గౌరవం ఏర్పరిచిన వ్యక్తి. నిజం జమానా లో, వరంగల్ లో చదివి లెక్కల లో ఒక పతకం పొందిన మనిషి. అందుకే లెక్కలంటే ఆయనకి అంత ఇష్టం గా ఉండేది. వ్యక్తిత్వం లోను లెక్క ప్రకారంగా ఉండేవాడు. హేతువాది. రిటైర్ అయిన తరువాత "సుల్తానాబాద్ (కరీంనగర్ జిల్లా) లో మహిళా స్కూల్ కోసం పెద్ద వారితో కస్టపడి నిర్మాణం లో మున్డుంది నడిపించాడు. ఆ నిర్మాణంలో కర్చయిన పదిహేను పైసల లెక్క కూడా చెప్పే వాడు ఇ లెక్కల సారూ. అప్పుడు అందరు ఇయన పట్ల కొంత భయ భక్తుల తో ఉండేవారు. అక్కడి ఎం.ఎల్.ఎ. (ఇద్దరు మాజీలు) ఇయనకి దగ్గరి వారు, భయపడే వారు. నేను లెక్కల్లో ముందుండే వాడిని. అల్లాంటి నన్ను మా లెక్కల సారు, మార్కండేయులు హోం వర్క్ తప్పు చేసానని కొట్టాడు (తప్పు కాకున్నా). నేను మా  తాతయ్య పైన ఫైర్ అయ్యా.. నువ్వు చెప్పే లెక్కలు వింటే స్కూల్ లో తప్పులు పోతున్నాయని. సరేలే మీ సార్ నే అడుగుతాను అని, తరువాతి రోజు స్కూల్ కి వచ్చాడు. మా పెద్ద సారు (అంటే ప్రిన్సిపాల్) ప్యాంటు తడుపుకున్నంత పని చేసి, మార్కండేయులు అనే సారు నీ సస్పెండ్ చేసాడు. ఆ తరువాత ఎవరెన్ని చెప్పిన, చివరకు మా తాతయ్య చెప్పిన వినలేదు. ఎలాగోలా ఆయనకు ఒక సంవత్సరం తరువాత మల్లి తీసుకొన్నాడు..

"టీచర్స్ డే" అనగానే తాతయ్యే గుర్తొచ్చాడు..ఎంతో రాయలనుకొన్న, ఎంతో బాగా రాయలనుకొన్న..నా శక్తి ఇంతే అని ...ఆయనను మరోసారి తలుచుకొంటూ.., ఆయనతో పాటు మా కీసరగుట్ట సార్లు (ముక్యంగా నిజాముద్దీన్, ఆళ్వార్, సివారం రెడ్డి, శ్రీదర్), ఎందరికో ఆదర్శవంతమైన మా నాన్న, మా నాన్న వారసత్వం కొనసాగిస్తున్న మా తమ్ముడు, గోపి gopi krishna కి ... అందరికి ఉపాద్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

Thursday, July 12, 2012

సత్యమే శివం -2



సత్యమే శివం  సినిమ మొత్తం ఒక తొమ్మిది నిమిషాలలో..!

శివ:...ఓ.! మీరు దేవుడిని నమ్మరు కదా???
సత్య:..దేవుడి మీద నమ్మకం లేదని ఎవరన్నరు.!
శివ: ఓహ్! ఇప్పుడు మీకు సడన్ గా దేవుడిమీద నమ్మకం వచ్చిందా?
సత్య: ఎప్పడినుంచో ఉంది
శివ: ఎవరా దేవుడు
.....
సత్య: నీవే
.........ముక్కు మొహం తెలియని ఒక అమ్మయి కోసం ఆ కన్నిరు కార్చే మనసుందే అదే దైవం..

శివ: ఎంటి సడన్ గ ఇంత వినయం
సత్య: ఎందుకంటే నెను దేవుడినే >>
....అర్దం కాలేదా..అర్దం కాకుడదు, అదే దేవుడు.
......ఒకడిని చంపాలనివచ్చి, మనసు మార్చుకొని అతన్నే క్షమాపన అడిగావంటే అదే దేవుడు,,
"నమ్మండి నాస్తికులుగ మాట్లాడకండి, ఊరంత చాల మంచి వాల్లు ఉన్నరు, వాల్లంత దేవుల్లే"

Wednesday, June 20, 2012

సత్యమే శివం...


మిత్రుడు నరేంద్ర గారు నాకు పంపించిన ఒక టపా. 
"సత్యమే శివం..ఒక phd చేయ తగ్గ సినిమా అది..దాని ప్రభావం మన మీద ఉండడం మంచిదే..సత్యాన్వేషణ ఈ విధంగా సాగించడం లో కొంత మనశ్శాంతి ఉన్నట్టు అనిపిస్తుంది..
నేను శివం 
నీవు  శివం 
నేనే శివం ...(నాస్తికులకు సత్యమే శివం) 

సత్యమే శివం
అను మంత్రమే పథం
సత్యమే శివం
అను సత్యమే నిజం

సత్యమే శివం
అది మనకహర్నిశం
సత్యమే శివం
అది మతం, అభిమతం"
(courtasy : narendra pall)
 
 సత్యమే శివం లో పాట ...నన్ను ఎంతో  ఆలోచింప చేసే పాట. 
 
నేనే శివం, నీవు శివం ! సత్యం శివం, స్నేహం శివం !! 
ఆస్తికులైన హితులందరికి, శివమే సత్యమట ! 
నాస్తికులైన స్నేహితలుకు ఆ సత్యమే శివమంట !! 
సత్యం శివం స్నేహితం సత్యం శివం జీవితం నేనే శివం, 
సాటి మనిషికి సాయం చేసే మతమే నీ మతము 
మానవ సేవే మాధవ సేవను హితమే సమ్మతము 
సత్యం శివం సత్యం శివం జీవితం సత్యం శివం సత్యం శివం జీవితం 

Friday, June 15, 2012

ఓడిన ఎన్నికలు..

ఉప ఎన్నికల రిజల్ట్స్ అనుకొన్న మాదిరిగానే వచ్చాయి. అయితే రిజల్ట్స్ ముందు జరిగిన టి.వి. చర్చలలొ మన నాయకులు, విశ్లేషకులు నితి సూత్రాలు కొన్ని వల్లించారు. అందులో మొదటిది "డబ్బు పంపిణి".

పెద్ద ఎత్తున జరిగిన డబ్బు పంపిని.., ఓట్లు మారకుండ ఉండెందుకే ఉపయోగపడ్డట్టున్నాయి. డబ్బు తీసుకొన్నవాడు ఓట్లు వేస్తాడనే నమ్మకం కన్న, డబ్బులు పంచకపోతే మనకు రావల్సిన ఓట్లు కూడ రావనే భయం పార్టీ లకు ఉంది.  డబ్బు పంచక తప్పని పరిస్తిథి. అలాంటప్పుడు తప్పు రాజకీయ నాయకులది ఎలా అవుతుంది. మరో అంశం కులం.. ఎన్నికలలో గెలుపు ఓటములు ఎక్కువగ కులాల సమికరణాలపైన అధర పడే పరిస్తితి.., జనాభిమానమున్న నాయకుడైన, అత్మాభిమనమున్న నాయకుడైన, ప్రజా నాయకుడైన, ఉత్తిపున్యానికి నాయకుడైన వీటి మీద "మాత్రమే" అధారపడే పరిస్తితి.. ఇప్పుడు గెలిసిన వై.ఎస్.ఆర్ అభ్యర్తులను చూస్తే..    M. R. రెడ్డి (నెల్లూర్), B.K. రెడ్డి (తిరుపతి), గుర్నత రెడ్డి (అనంతపుర్), K.R. రెడ్డి (రాయదుర్గం),M. Ch.K. రెడ్డి (ఎమ్మిగనుర్), S.N.రెడ్డి (అళ్ళగడ్డ), A. రెడ్డి (రాజం పెట), G.S.రెడ్డి (రాయచొటి), M.Ch. రెడ్డి (ఉదయగిరి), B.S.రెడ్డి (ఒంగోల్), M.S.రెడ్డి (పత్తిపాడు).....
ఇది జనాలు, నాయకులు కలిసి పోషించుకొంటున్న సంస్కౄతి..! జగన్ కోసం, వై. ఎస్. ఆర్ కోసం జనాలు ఓత్లు వేసరు అనుకుంటే..పై నున్న సమీకరణాలు వెరుగ ఉండవచ్చు కధ.! తను ఎలాంటి వాడైన పైనవి తప్పవని  చెప్పడమే నా ఉద్దేశం.      

ఇవే కాకుండా.., తాత్కాలిక సెంటిమెంట్లు, ప్రలోభ పతకాలు, ఊర్లో గుడి చందాలు, పిల్లలకు క్రికెట్ కిట్లు, చీరలు, నగలు, మద్యం ....కొత్త వాడికి చాన్స్ ఇద్దామని, పాత వారిని  మార్చుదామని తప్ప నచ్చేవారే లేని ఎన్నికలు ఎన్నిసార్లు వచ్చిన అవి ఓడిపోతాయి...


 

Monday, June 4, 2012

ఇదీ మన భారతీయం..


ఈ రోజు రేడ్ ఎఫ్. ఎం. లో వచ్చిన ఒక బక్ర కాల్.
ఆర్.జె. రాజు మూసాపెట నుంచి పోటి చెస్తున్నానని పరిచయం చెసుకొని మాటలు మొదలు పెట్టడు. కాల్ తీసుకొన్న పెద్దయన "దెనీకొసం పొటి, ఇప్పుడు ఎలక్షన్స్ ఎంటి" అని ఎమి అలోచించలేదు. ముడో డైలగ్ లోనె ఇంట్లొ ఎంతమంది వోటర్స్ ఉన్నరు, "ఎమి కావాలి" వరకు వెల్లిపొయింది. అందరు బంగారం ఇస్తున్నరు కాబట్టి బేరం బంగారనికి వెల్లిపొయింది. మన ఆర్. జె. "ముక్కు పుడకలు" పంచుతున్నను పంపిస్తను అని చెప్పాడు. అవతల ఉన్న పెద్దయన "మా ఇంట్లొ మొత్తం ఏడు వోట్లు ఉన్నయి కొంత మంచిగ పంపించండి. ఏడు ముక్కుపుడకలు కావలి" అంటు బేరం సాగదీసాడు. "తన ఇంట్లో లేవలెని బామ్మ ఉందని, అమేతో కూడ వోటు వెయించె బాధ్యత తనదని, తను గ్యారంటి అని, బంగారం మాత్రం తప్పక పంపాలని" డిమండ్ చెసాడు. మధ్యలొ ఎక్కడ "అది ఎమి పోటి అని కాని, ఏ పార్టి అని కాని, అభ్యర్తి పేరేంటి అని కాని" ఏమి అడగలేదు.  

ఇదీ మన భారతీయం... అద్భుతంగ సంస్తాగతమైన మన లంచాల వ్యవస్త.. మనకు మంచి వారు రావలని అశ, కోరిక, తాపత్రయం ఏమి లేదు. అలాంటప్పుడు మనకు మంచి పరిపాలన రావలని ఎలా డిమండ్ చేస్తాం??
ఈ ఉప ఎన్నికలలో పంచుతున్న 30 కోట్ల డబ్బు, కిలోల కొద్ది బంగారం, వేల లీటర్ల మద్యం దొరికింది.. దొరికిందే ఇంతైతే దొరకని సొమ్ము ఎంత ఉందో?? అది ఎలక్షన్ల నాటికి ఎన్ని కోట్ల కు చేరుకొంటుందో ?? అత్యంత అవీనీతి పరులు ప్రజలే.. ఇలాంటి ప్రజలకు నీల్లు కావలి, కరెంట్ కావలి, రోడ్లు కావలి, అవినీతి లేని ప్రాజెచ్ట్లు కావలి అని ఆడిగే హక్కు లేదు.   

భారతీయుడు అయినందుకు "భయంకరంగ" గర్వ పడుతున్న..

Tuesday, May 29, 2012

Truly "Me"

అబద్దమే అందంగా కనపడుతునప్పుడు
మెరుస్తున్నదేదో నను మురిపిస్తునప్పుడు 
అర్దం కానిదేదో అధ్భుతమై భ్రమ పెదుతునప్పుడు
విశ్వాన్ని అంగికరించలేక పర లోకం వైపు చేతులు చాచినప్పుడు
కనపడే ప్రపంచన్ని దాటి దైవం కొసం కళ్ళు మూసుకొనప్పుడు
నా మనుసును తట్టి అడుగుతాను
నాకు నేనుగా బ్రతికెదెలాగనని
మాయ పొరలు చీల్చుతు పయనిస్తాను
"సత్యమే శివం" అని..! 

Wednesday, May 23, 2012

తిరిగి రాని ఉషోదయం

అందం ఆనందంగా ఆడుతుంటే  
నా లాగె, సముద్రం 
ప్రేమను అలలా చేసి 
తన కాళ్ళను తడిపింది..

తానూ కాళ్ళను తుడుచుకొని వెళ్ళిపోతే 
గంభీరంగా వేనేకే  నిలిచింది. 

ఆవేశామైన, ఆహ్లాదమైన 
అల ఒకటే తన భావమైంది 
సరదాగా ముంచెత్తే 
ఉప్పన ఒకటే తన భాష అయింది 
సుడులు తిరిగే బాధనంత 
గుండెలోనే దాచుకుంది  

ఆమె ఆనందానికి సముద్రమే తలవంచింది 
నా కోసం అది అద్దం అయి నిలిచింది 
నా మనుసు లోతు   కొలిచి చూపింది 

  

Tuesday, May 1, 2012

మే డే శుభాకాంక్షలు

నరాల బిగువు, కరాల సత్తువ
వరాల వర్షం కురిపించాలని
ప్రపంచ భాగ్యం వర్దిల్లలని
గనిలో, పనిలో, ఖార్కన లో
పరిక్లమిస్తు, పరిప్లవిస్తు
ధనికసమికి  దాస్యం చెసే
యంత్ర భూతముల కోరలు తొమే
కార్మిక వీరుల కన్నుల నిండ
....విలాపగ్నులు, విశాదస్రువులు తగ్గి ఈ రొజైన తమదొక దినమని అశలు పూయలని, అవి నిజాలవ్వలని
అసిస్తు.. మే డే శుభాకాంక్షలు

Thursday, April 26, 2012

చలం మాట

పై నటన పొర తీసేస్తే అంతా నేనే, నేను తప్ప ప్రపంచం లేదు. నేను అనే దాంట్లోంచి తప్పించుకోలేను. తమాషా కోసం ఒక పట్టణం తగలబెట్టిన, నా కోసమే ఒక చీమ కోసం నా ప్రాణాన్ని అర్పించిన నా కోసమే. అంతా నేనే. ఈశ్వరుడు నేనే.  సృష్టి కి మూల సూత్రం నేనే. నా నుంచి, నా ఆనందాని నుంచి తప్పించుకోలేను. తప్పించుకొంతున్ననుకోవడం ముర్కత్వం, నన్ను నేను మోసపుచుకోవడం, త్యాగం చేస్తున్నానని సంతోసించడం వెర్రి భూటకం. 

నేను కానిదంతా మాయ..
ప్రపంచం లేనే లేదు.! నేనే ఉన్నాను  - చలం 

Universe is Extension of Me - నా మాట  

ప్రారంభం

ముగింపు ఎక్కడో ముందే తెలిసుండాలి. ఈ తరహ ప్రారంభాలే చరిత్ర సృస్టిస్తాయి. 
"ప్రారంబించు, పనిచేయు, కష్టపడు, దుసుకెల్లు " - అన్నింటా నీ ముద్రే ఉండాలి. 
నీ దైన ప్రారంభం జనానికి పెలవంగానో, పేలపిండి గానో కనపడిన భేఖతరుగా ఉండు. ముగింపు తెలిసిన వాళ్లకి ప్రారంభాల పట్ల భయాలు, భాదలు, బి. పి లు, శాపాలు ఉండనే ఉండవు.   వొకడి ప్రారంభం వాడికే ప్రత్యేకం. ఆ దారిలో మనము  పొతే భానే ఉంటుంది, నడక వరకు. గమ్యం చేరుతామా లేదా అనేది చెప్పడానికి చిలక జోస్యాలు, పలక జోస్యాలు చాలానే ఉన్నాయి. 


చిత్తశుద్ది గల ప్రారంభానికి అనూహ్యమైన ముగింపు రావచ్చు. మరేమీ నష్టం లేదు. అభిమాన్యులు గ మిగులుతాం.

ప్రారంభించేది ఎందుకో తెలియడమే జ్ఞ్యానం. సుక్ష్మంగా చుస్తే ప్రారంభం లోనే ముగింపు, గెలుపు ఉన్నాయి.
అన్ని సార్లు అన్ని ప్రారంభాలు, గెలుపు, ఓటముల గమ్యాల వైపే ఉండకపోవచు. 
జీవితంలో గెలుపు ఓటముల తో పాటు పోరాడినవి, పోరాడనివి కూడా ఉంటాయి. అందుకే ప్రారంభం పోరాట పటిమకు తోలి ఉపిరి కావలి. నీ తోనూ, ప్రపంచం తో చేసే నిరంతరం నీవు చేసే పోరాటం సరిగా ప్రారంభం అయిందో, లేదో తేల్చుకోవడం నీదైన ప్రారంభానికి ప్రారంభ సూచిక.
(త్రిపురనేని శ్రీనివాస్, ఆంధ్రజ్యోతి 1997 ) 

Thursday, March 1, 2012

ఏందీ లొల్లి ..అనబడే 26 వ రాజకీయ భేతాళ కథ (పంచ వింశతి కథ లకు మరొకటి)

"ముళ్ళపూడి" గారి రాజు గారు, రెడ్డి గారు ఎప్పుడో పోయారు. రాజు గారి రాజకీయ కథ లు విన్న రెడ్డి గారు హాయిగా విశ్రాంతి తీసుకోగా., రాజు గారు పనిలేక తన మేధస్సు నంత తన వంశానికి ధారపోసి, పోసి పోయారు. ఆ రాజు గారి మనవడు ఒక రోజు ఒక  సందర్శిని లో టీ తాగుతుండగా...
"రాజు ! ఒక అకాసానికి ఇద్దరు చంద్రులు అవసరం అంటావా" అని ప్రశ్న వినపడే సరికి రాజు గారి మనవడు, రాజు అనే మన పాత్రధరి ఆలోచనలో పడ్డాడు, "అనవసరం" అనే సమాధానం ఉహించి అడిగిన ఆ ప్రశ్నాకి ఏమి సమాధానం చెప్పల అని.
"ఈ ప్రశ్నఅవసరమా సీను" అని చెప్ప గలిగాడు మన రాజు.
తరువాత రాజు, సీను ల మధ్య సిన్ ఈ విదంగా నడిచింది.
" అది కాదు, అసలు ఉంటాయ అని"
" ఎందుకు ఉండవు, అమావాస్య చంద్రుడు, పున్నమి చంద్రుడు.., ఇలా రక రకాలుగా.."
"కాని కలిసి ఒకే దగ్గర ఒకే సారి ఉండవు కదా.."
"అభ్బో! బాగా చెప్పావు., సరే ఎందుకు రెండు చంద్రులు అనవసరమో చెప్పు, అయిన ఈ చంద్రుల గోలేంటి"
"అక్కడ ., ఆ టి.వి చూడు."
టి. వి చానల్ ని మధ్యకి చీల్చి శేఖరుడిని, బాబుని చూపిస్తున్నారు
"నిజమే సీను.. ఇద్దరు అనవసరమేమో, ఈ ఇద్దరు అనవసరమేమో" 
"వీళ్ళు కాకా మనకి ఎవరున్నారు.. రాజు గారి కొడుకు ఎవరిని తిడుతున్నాడో, ఆయనను ఎవరు తిడుతున్నారో అర్థం కవట్లేదే?"
"అయిన మాట్లాడేది ఏది అర్థం కాదులే, దానికో saperate మత భాష ఉంది"
"ఇంతకూ లు_, లఫా_, లత్క్__ ఎవరు అంటావు." (వాళ్ళు మాట్లాడిన, టి.వి వాలు చూపించిన, పేపర్ వాళ్ళు రాసిన, నాకు రాయడానికి, మీకు చదవడానికి ఇబ్బంది అని...)
"ఎవరైనా సరే!  అందరిని అసెంబ్లీ పంపించాం., భయట ఎవరు మిగలలేదు" 
"అయితే ఎవరు ప్రతి పక్షం, ఎవరు అధికార పక్షం, ఎవరు స్వపక్షం , ఎవరు విపక్షం, ఎవరు ఎవరిని తిడుతున్నారు, ఎవరు ఎవరిని పొగుడుతున్నారు,
ఎవరిదీ వేర్పాటు వాదం, ఎవరిదీ వితండ వాదం, ఎవరితో ఎవరు ఎందుకు కుముక్కయ్యారు.
అది తెలిసి చెప్పక పోయావో ఇదే హోటల్ లో మరో టి తగిపిస్తా, అదే టి.వి. చూపిస్తా.అప్పుడు నీ తల వెయ్యి జండుబం లకు తగ్గానంత గ పగిలి పోతుంది.."
" ఆపు. నా తల already veyinara mukkalayindi. సరే నా సమాధానం విను"
" అందరు విపక్షమే, ఎవరు ప్రజా పక్షం లో లేరు
ఎవరు ఎవరినైనా తిట్టవచ్చు. రేపు వల్లే వరిని  గొప్పగా పొగడ వచ్చు. ఏ రోజు వార్తాలు ఆ రోజే మర్చిపోయే విదంగా మన ప్రజలకు గొప్ప తర్పిదు ఇచ్చారు.. టి.వి. చానల్స్ ద్వారా!
 అందరిది ఒకటే వాదం. తమ వారికే అధికారం కావాలనే విధానం. వేర్పాటు వాదం, కుల వాదం, అభివ్రుది వాదం, సమైక్య రాగం, ఇలా అన్ని వాదాలు ఒకే విధానం లోని వేర్వేరు దారాలు.., దారులు. అవన్నీ సీటు కోసం పడే కోటి తిప్పలు, చేసే కొటినర తప్పులు., లోక కళ్యాణం లో అవన్నీ ఒప్పులు"
టి tagaDam ayipoyinanduna రాజు kappu kinda petti తన soda muginchadu.
" రాజు! నా చివరి ప్రశ్నఅన్న కి సమాధానం చెప్పలేదు, ఎవరు ఎవరితో కుముక్కయ్యారు. సేకర దొర, రాజు  గారి అబ్బాయితోన, బాబు గారు కిరానుడితోన , narayana, mental hospital varitona, Jprakasham గారు బాబు గారి పక్కవారి తోనా, ఆగం గారు దొర బిడ్డలా తోనా..చిరు జీవుడు రాజ్య సభ సీటు తోనా, జ్యోతి వాళు సి. బి. ఐ తోనా, ఈనాడు tv9  తోనా, తొందరగా చెప్పు, లేకపోతె నేను ఇంకో టి చెపుతా..!"
" అందరు కలిసి కుముక్కయారు. ఎవరిపైనా ప్రజలకు గౌరవం లేదని వాళ్లకి అర్థం అయింది, ఇప్పట్లో ఎన్నికలు రావు, రాకూడదు, ఒకరి తప్పు నీ ఇంకొకరి మిద రుద్దాలి.., అది తెలిసి అందరు "ప్రజలు" వ్యతిరేకంగా కుముక్కయారు"
"అదిగో బస్సు.. ఇది పొతే మరొకటి దొరకదు" అంటూ ...
పరిగెత్తి.., "రాజధాని ఎక్ష్ప్రెస్స్" బస్సెక్కి సిద్ధిపేట నుండి హైదరాబాద్ బయలు దేరారు.
(చదువరులకు ప్రార్తన: ముళ్ళపూడి వారి కథలు చదువుతూ అదే స్పూర్తి లో రాయాలనే అత్యాస తోటి, రాయగలననే కకుర్తి తోటి రాసింది. చిరాకు అనిపించినప్పుడల్లా క్సమించమని ప్రార్తన, మోతమంతా చిరాకే అంటే సినిన్మోహన్ బాబు గారి కి చెప్పుతా)