Thursday, September 27, 2012

మంచి తనం మించిన దొరకదు...


అందరిలో దైవం చూస్తూ, తనే దేవుడు అనుకొనే శివుడు (పాగల్ లో కూడా దేవుడు ఉంటాడనే పాగల్)
హిరో మిద అభిమానాన్ని , పేదలకు సేవ చేసే విధి గా మార్చుకొన్న చెరుకు బండి నూర్
పాత పురాణ సినిమాల్లో (అలంటి సినిమాలలో సినిమా కష్టాలు అతిగా ఉంటాయని..) కూడా చూడని కష్టాలను దాటి, క్షమా, ప్రేమ పంచుతూ పది మందికి ఆశ్రయం ఇచ్చిన అస్రఫ్ షరీఫా
పేదరికం తో పారిపోయి వచ్చి వంద మందికి అన్నం పెట్టగలిగిన ఎత్తుకు ఎదిగిన బాబురావు
"కలాం" గారి స్పీచ్ విని కొత్త జీవన శైలి తో ఎదుగుతున్న దిలీప్
పది రూపాయలకే అన్నం పెట్టి, తిన్న వాళ్ళను దేవులనుకొనే భారతమ్మ ..
ఇలాంటి వారు ఎందఱో..ఒక్కక్కరు ఒక పుస్తకం, పేదరికం అడుగున జీవిస్తూ, అద్భుతమైన వ్యక్తిత్వం తో మన చుట్టే తిరుగుతున్నా దేవుళ్ళు... మంచితనం చచ్చిపోయిందనే ఇసురోమనే మనుషుల మేధ కు ఆవల నిలిచిపోయిన వాళ్ళు..
"కందుకూరి రమేష్ బాబు" గారు ప్రచురించిన(సాక్షి, కౌముది లలో) కొన్ని వ్యాసాలలో బయటపడ్డ మేలి ముత్యాలు
http://samanyashastram.org/index.html  లో వెళ్లి "ప్రొఫైల్" వెదకండి

Wednesday, September 5, 2012

నా గురువు.., మా తాత

"తొమ్మిదో ఎక్కం చెప్పు"
"తొమ్మిది ఒక్కట్లు ..."
"ముందు నుంచి కాదు, వెనక నుంచి.."
..........
"sare...ముందు నుంచి చేపతనంటే పదమూడో ఎక్కం చెప్పు"
"పో నేను చెప్పను.. ఎవరియన మూడో తరగతిలో పదమూడో ఎక్కం చెపుతారా.."
..రాజమౌళి సారూ మనవడు చెప్పాలి..ఆ రాజమౌళి సారు మనవడిని నేనే..మొదటి తరగతి మొదలు పెట్టనప్పడి నుండి అయన దగ్గరే పెరిగాను. (అమ్మమ్మ దగ్గరే అయిదవ తరగతి వరకు చదివా). నా గురువు, మెంటర్, రోల్ మోడల్ అన్ని ఆయనే.  పేరుకి అతుక్కుపోయిన "సారూ" అనే మాటకు గౌరవం ఏర్పరిచిన వ్యక్తి. నిజం జమానా లో, వరంగల్ లో చదివి లెక్కల లో ఒక పతకం పొందిన మనిషి. అందుకే లెక్కలంటే ఆయనకి అంత ఇష్టం గా ఉండేది. వ్యక్తిత్వం లోను లెక్క ప్రకారంగా ఉండేవాడు. హేతువాది. రిటైర్ అయిన తరువాత "సుల్తానాబాద్ (కరీంనగర్ జిల్లా) లో మహిళా స్కూల్ కోసం పెద్ద వారితో కస్టపడి నిర్మాణం లో మున్డుంది నడిపించాడు. ఆ నిర్మాణంలో కర్చయిన పదిహేను పైసల లెక్క కూడా చెప్పే వాడు ఇ లెక్కల సారూ. అప్పుడు అందరు ఇయన పట్ల కొంత భయ భక్తుల తో ఉండేవారు. అక్కడి ఎం.ఎల్.ఎ. (ఇద్దరు మాజీలు) ఇయనకి దగ్గరి వారు, భయపడే వారు. నేను లెక్కల్లో ముందుండే వాడిని. అల్లాంటి నన్ను మా లెక్కల సారు, మార్కండేయులు హోం వర్క్ తప్పు చేసానని కొట్టాడు (తప్పు కాకున్నా). నేను మా  తాతయ్య పైన ఫైర్ అయ్యా.. నువ్వు చెప్పే లెక్కలు వింటే స్కూల్ లో తప్పులు పోతున్నాయని. సరేలే మీ సార్ నే అడుగుతాను అని, తరువాతి రోజు స్కూల్ కి వచ్చాడు. మా పెద్ద సారు (అంటే ప్రిన్సిపాల్) ప్యాంటు తడుపుకున్నంత పని చేసి, మార్కండేయులు అనే సారు నీ సస్పెండ్ చేసాడు. ఆ తరువాత ఎవరెన్ని చెప్పిన, చివరకు మా తాతయ్య చెప్పిన వినలేదు. ఎలాగోలా ఆయనకు ఒక సంవత్సరం తరువాత మల్లి తీసుకొన్నాడు..

"టీచర్స్ డే" అనగానే తాతయ్యే గుర్తొచ్చాడు..ఎంతో రాయలనుకొన్న, ఎంతో బాగా రాయలనుకొన్న..నా శక్తి ఇంతే అని ...ఆయనను మరోసారి తలుచుకొంటూ.., ఆయనతో పాటు మా కీసరగుట్ట సార్లు (ముక్యంగా నిజాముద్దీన్, ఆళ్వార్, సివారం రెడ్డి, శ్రీదర్), ఎందరికో ఆదర్శవంతమైన మా నాన్న, మా నాన్న వారసత్వం కొనసాగిస్తున్న మా తమ్ముడు, గోపి gopi krishna కి ... అందరికి ఉపాద్యాయ దినోత్సవ శుభాకాంక్షలు