Wednesday, January 9, 2013

దేఖో అక్భర్ సాబ్..! రాజకీయానికి మరో దారి ఉంది

మాట్లాడుకోవడానికి మనకు మంచి మాటలు ఇంకా మిగిలే ఉన్నాయి. మంచి మాట్లాడేవాళ్ళు ఉన్నారు. అక్బరుద్దీన్ తన మనుగడ కోసం, రాజకీయ లబ్ది కోసం అన్న మాటలు అతననుకొన్న ప్రతాపం, ప్రకోపం చూపించలేదు. అందుకు కారణం అందరు అలాంటివాళ్ళు కాకపోవటమే. నీలాంటి వాళ్ళు ఇంకా తెగపడ్డ దారుణాలు జరగవు అని చెప్పారు ..ఎందుకంటే...

మాకు దసరా జమ్మి ఎంత తెలుసో, పిరిలా పండుగ అంత తెలుసు
గుడికి, దర్గాకి తేడ తెలియక పెరుగాము
చిన్నోడికి కడుపునొప్పి వస్తే పీర్ సాబ్ దగ్గరికి పోయాము
ఖాజా సాబ్ కి జమ్మి ఇచ్చి కాలు మొక్కం
గణేష్ నిమజ్జన్నైకి రావాడానికి "భాష" కి అడ్డేమి లేదు
వాళ్ళంతా వేరే మతం అని పెరగలేదు..,మా లాగానే వాళ్ళది మరో కులం అనే అనుకొన్నారు
అల్లుడు అన్నారు, బావ అని మా బాపు ని పిలిచారు
నికేమి తెలియక పోవచ్చు..నివు చదివింది, పెరిగింది ఇక్కడ కాకపోవచ్చు.
పిరులు ఎత్తడం నేర్చుకో, దర్గా లా చుట్టూ ఏముందో చూడు..
రాజకీయానికి మరో దారి కూడా ఉంది.., దగ్గరికి వెళ్లి చూడు
దగ్గరికి వెళ్లి చూడు
మసీదుల్లో నే కాదు., మనుషుల్లోనూ అల్లా ఉన్నాడు

1 comment:

Narsimha Kammadanam said...

ఆల్ల లెక్కల ప్రకారం ఎక్కడా లేడు.డబ్బులోనే అంతా ఉంది,సుమారు 35 ఏళ్ళ నుండి వ్వరి చేతిలిఓ ఉన్న నియొజకవర్గం ఇప్పటికీ అతి ద్దరుణంగా ఉంటుంది,అంతా దోపిడేఅ...అయినా వారి అసలు పుస్తకం ప్రకారం కూడా ఆ సొ కాల్డ్ దెవుడు మనుషుల్లో ఉండడు..అది నిరామయం నిరాకారం ఇక పీర్ల పండగ మన పైత్యం వారి పుస్తకం పీర్ల పండగని ఒప్పదు వారికి విగ్రహారాధన లేదు!అది మన పైత్యమే...అందు కే వారికి మనం నచ్చం!!! (ఇంత మర్యాద నేనివ్వలా ప్రతీ మర్యాదక పదం అమ్మనా బూతు కాని బ్లాగుని పాడు చెయ్యడం ఇష్టం లెక)