Monday, November 24, 2008

మన కథ

టెలికాస్ట్ కాని ఒక టి. వి. సీరియల్ కోసం రాసిన చిన్న పాట.

అనగనగా అనే ఊరి కథ
వినాగా వినగ మానది కథ

అలుపే లేని పోరాటాల తెలంగాణ పల్లె కథ
మాట తప్పని పౌరుశాల రాయలసీమ ఊరి కథ
సోచమైన మనసే ఉన్నా ఉతరంద్ర వారి కథ
కృషినే నమ్మి ముందుకు సాగే కోన సీమ గ్రామ కథ
ప్రతి కథ ప్రతి ఒక్కరి కథ, ఇదే మనందరి కథ


పేదరికము తో డాబులు పోయే గ్రామా పెద్దల పొగురు కథ
కస్తాల తోనే కపురమేట్టే రైతు లందరి వ్యధల కథ
అల్లరే తమ జీవితం అను కొనే ఆకతాయిల పోకిరి కథ
అందానికే సిగ్గులు పుట్టే తెలుగ మ్మయిల వోని కథ
ప్రతి కథ ప్రతి ఒక్కరి కథ, ఇదే మనందరి కథ

ఊరి గడి లో కూచుంటే గుర్తుకోచే ముచాట్ల కథ
రచ బండ పై పేదలు చెప్పే పాత గొప్పల కబుర్ల కథ
అవునత కదా అని అమలక్కలు బుగ్గలు నాకే కోత కథ
ఎంజాయ్ అంటు జాలీగా తిరిగె యువతరానికి నవ్య కథ
ప్రతి కథ, ప్రతి ఒక్కరి కథ, ఇదే మనందరి కథ

నవ్వుల కథలు మరిచిన వెతలు
మెచ్చిన కథలు మీకు నచ్చే కథలు

ఏరి కూర్చిన మన పందిరి పూలు
దండగ మార్చి అందిస్తున్న ......ప్రతి కథ
ప్రతి కథ , ప్రతి ఒక్కరి కథ ఏది మన అందరి కథ