Friday, November 11, 2011

భయపెట్టె బ్రతుకే

భయపెట్టె బ్రతుకే నీది,
నీకై నువ్ నిలబడకుంటె
వెంటాడే గతమే నీది, నీలో నువ్ వెదుకుతు ఉంటె!
మాటెసె కన్నె ఉంది
కాటేసె చూపె ఉంది
నిన్నె అది ఆడిస్తుంది ..జాగోరె!
పోరడే దమ్మె ఉంది
ఆడెస్తే గెలుపే నీది
ఆపెస్తె ముంచెస్తుంది ..సాగో రె!
కాలంతో నీ పోరటం
ఎప్పటికి ఆపకు నేస్తం
వెన్నంతి ఉందో సత్యం చూడర!
బెదిరిస్తే బెదురును లోకం
ఎదిరిస్తే గెలుపే తత్యం
పోరదితే నీదె విజయం .సోదర!
జీత్ మే తు జీన సీఖొ
హర్ పల్ సే లడ్నా సీఖొ
పల్ పల్ మే జీవన్ దేఖొ! ..

Saturday, October 8, 2011

కను రెప్పల చాటున

సాంగ్ ౧:
నిజమేదో దాగుంది
చిక్కని చీకటి మద్యన
కాటేసే చూపుంది
కను రెప్పల మాటున

తరుముతోంది ని గతం
తప్పు నిది కాకున్నా
య్హే సాల .. జీవితం
పిచే మత దేఖ్ నా


song 2

కను రెప్పల మాటున ఒక చూపుంది..
చిక్కని చీకటే నిజం చెపుతుంది.!
తప్పుకొలేవు..తప్పించుకోలేవు.
పారిపోలేవు.., పట్టుకోలెవు...
you dont have choice
chase your life..
it is hauning you
piche math dekh...

Tuesday, October 4, 2011

బతుకమ్మ



గూనుగు పూల పెద్ద బతుకమ్మ
తంగెడు పూల తీరైన బతుకమ్మ
వాయినమిచ్చె సద్ది బతుకమ్మ
సల్లంగ చూడు తల్లి బతుకమ్మ
పోయి రావమ్మ మా ఇంటి బతుకమ్మ

అందరికి బతుకమ్మ శుభాకంక్షలు

కళ ప్రపూర్ణ శ్రీ కాపు రాజయ్య గారిని పోయిన ఏడాది కలిసి జమ్మియిచ్చి పాదాభి వందనం చేసి తీసుకొన్న చిత్రం

Friday, September 16, 2011

వంశీయం

"హద్దుల మద్యన ఒదగని, వశీకరణలకి లొంగని...వంశీయం"!!!
అతి తక్కూవ పదాల్లో, అద్భుతమైన వ్యక్తిత్వ వ్యక్తికరణ ....
నా మీద నీకున్న అభిప్రాయానికి దగ్గరగ జరగాలనే ప్రయాణం!!
నా పేరుకు నీ పదాలే టాగ్ లైన్ కావాలని నా ప్రయత్నం
నా పుట్టిన రోజు కి కే. శ్రీను పంపిన గ్రీటింగ్స్ లోని కొటేషన్ ..
దానిపై నా రియాక్షన్

Thursday, September 8, 2011

పోరాటం పై పోరాటం


"అవినీతి పోరాటం" పై అలుపెరుగని "పోరాటం" చేస్తున్న మేదావుల ఆంతర్యం అసలు అర్దం కావడం లేదు. ఈ పోరాటాలు, వాటి తీరు నచ్చలేదు, ఇలా కాదు ఇలా చేయలి అంటే విషయం అర్దం అవుతుంది. కాని వాటిని, చేస్తున్న వారిని అంతగా "అసహ్యించుకోవల్సిన" అత్యవసర ఆగత్యం, దాని "అంతర్యం" అర్దం కాలేదు. అరుందతి రాయ్ మట్లాడిన, అరుణ రాయ్ మాట్లాడిన, అన్నా చెప్పిన, ఎవరెవరు ఏది చెప్పిన వారు చూపిన, చూపిస్తున్న కల, అశయం చాలమందికి స్పుర్తిని ఇచ్చిన మాట వాస్తవం. టి. వి,. లో ఆ తతంగం చూసినపుడు నేను నవ్వుకొన్న మాట నిజం కావచ్చు. "మానవ హక్కులే", అవినీతి కంతె పెద్ద సమస్య అని నమ్మినవాడినే. కాని ఇలా అర్జంటుగా విరుచుకుపడి విషం చిమ్మలేదు. "మద్య తరగతీ ని ఒక మూర్కపు సమజానికి ప్రతి రూపంగ, అత్యాసపరులైన అవకాశవదులుగా, చిత్రీకరించడం మహ మేదావులకు అలవాటైపొయింది. ఈ విమర్శలలో మరో కోణం "నా/ మా పోరటాలు మత్రమే మీరు చేయలి, మీరు మరేది చేసిన అది కూహన స్వార్దమే" అనడం.. ప్రతి ఒక్కరికి తెలివి లేని దద్దమైన సరే, వాడికి నచ్చే పొరాటనికి మద్దతు ఇచ్చే కనిస హక్కు ఉంది.

తిరిగి వచ్చిన ప్రేమ టపా

అందుకే నీవంటే ప్రేమ!
..బాధపడటం అంటే ఏంటో తెలిసింది నీ వల్లే
-ఆ బాధలో కూడ ఓ ఆనందం ఉంటుందని తెలిపింది నీవే!

నిజానికి నేనామెను మర్చిపోయి ఉండేవాన్నేమో..,
ఆమె నన్ను గుర్తుపెట్టుకుందని తెలియకపోతే !

తెలుసు! నిన్నింక తలుచుకోవడం సామాజిక నిషిద్దం
నిన్ను మరిచిపోవడం .., అబ్బో అదో మానసిక యుద్ధం!

Thursday, August 25, 2011

ఇది కూడ నేనె!!!



అశల చిగుర్లకి పచ్చని రంగు వేసి
పాత కలలకు కొత్త చొక్కా తొడిగి
అంతులేని దైర్యం అప్పుగా తెచ్చుకొని
మాటలకు అరువు పదాలు అతికించి
అర్థం కాని కొత్త కథల నేడు నేను..,

భయానికి అచ్చమైన అర్థంగా
అమాయక విశ్వాసాల ప్రతిరూపంగ
మొలకెత్తని నాటు విత్తనముల
సొంత సంతోషాల, చిన్న చిన్న ఆనందాల
ఊరి మట్టి తో నా సొంత్త పేరు లా నాడు నేను

Monday, June 27, 2011

కాపీ మాట

నేను నీ ప్రేమ లో మునిగిపోయాను. ఎంతగా అంటే ఈ ప్రపంచాన్ని పట్టిచుకోనంత, నీ తో సహా ...
అర్థం కాలేదా.., నేను నీ కంటే, నీ పై ఉన్ననా ప్రేమనే ఎక్కువ ప్రేమిస్తాను.
I love you so much... so much so that, nothing can matter to me..,not even you..

Thursday, June 23, 2011

సత్యమే శివం

దోచుకున్నవాడు దొంగ కాదు., దోచున్కున్నది దాచుకోన్నవాడు దొంగ కాదు. దొంగతనంగా దాచుకొన్నది పంచుకోన్నవాడు మాత్రమే దొంగ. ఇప్పుడు కోతగా లెక్క పెడుతుంటే , ఇన్నాళ్ళు లెక్క చెప్పని వాడిది తప్పు లేదు. భారత ప్రబుత్వానికి బాద్యత లేదు. అపారమైన నల్ల ధనం, రాజ భోగాలు. మీ నమ్మకం విలువ ఏంటో ఇప్పుడైనా తెలుసుకోక పోతే, ఇక నమ్మకం అనే దానికి విలువ అక్కర లేదు, మన నమ్మకాన్ని అసలు మనం నమ్మనక్కరలేదు. ఎవరో చెపితే, ఎవరో అనుసరిస్తే, మనవాళ్ళందరూ నమ్మితే మనం నమ్ముదాం.

Thursday, June 2, 2011

ఆదివారం రంగోలి

AG కాలేజీ, రాజేంద్ర నగర్, బి హాస్టల్ లో ...టిఫిన్ అయిపోతుందంటే ఎ ఎనిమిది, తొమిది గంటలకో లేచేది, సండే మాత్రం పొద్దున ఆరు గంటలకే లేచి, సెవెన్ హిల్స్ లో టీ తాగి, టివి రూం లో సెటిల్ అయ్యి DD లో (దూర దర్శన్ - అదృష్టం బాగుండి, అ ఒక్క ఛానల్ మాత్రమే వచ్చేది, ఇది 94-98 లో మాట) రంగోలి చూస్తుంటే ఆహ, ఆ మత్తు ఆ వారమంత ఉండేది. పాత హిందీ పాటల పరిచయం నాకు అక్కడే. ఎన్ని కాస్సేట్ట్స్, ఎన్ని సాంగ్స్... ఒక్కో సాంగ్ రోజుకు పది సార్లు విని, ఇరవై సార్లు పాడుకోని, వందల సార్లు ఆహ అనుకోని..ఆహ! పాటల్ని ప్రేమించి, అనుబవించి, పాటల్నోని ప్రేమని అనుబవించడానికి, అమ్మాయిల్ని ప్రేమించి, ఓహో!! అప్పుడప్పుడు సాయంత్రం హాస్టల్ పైన, పార్టీలలో విరహ గీతాలు, శ్యాం గాడి తెలుగు ప్రేమ గీతాలు (కొందరి కోరిక మేరకు), వాటిలో నంజుకోవడానికి గిల్బీస్ గ్రీన్ లేబిల్. ఇదంతా గుర్తుకు వచ్చి గూగుల్ లో వెదికితే మంచి పాట దొరికింది. క్రింద ఇచ్చిన పాట క్లిక్ చేసి చూడండి, మీరు ఎంజాయ్ చేస్తారు.
http://www.youtube.com/watch?v=lhxG1NMZITI