Wednesday, July 29, 2009

పది సంవత్సరాలు అయిపోయాయి, కాలేజీ వదిలి. దశాబ్ధములో ఎంత మార్పు.
ఎ జి కాలేజీ, రాజేంద్ర నగర్, బి - హాస్టల్ ఫ్రెండ్స్ పార్టీ లో
కలిసి నవ్వుకొని, ఆ రాత్రంతా తనివీ తీర (జ్ఞాపకాలని) తాగిన ఆ రోజు గుర్తుకోసం..., (తెల్లారే ఇంటినుంచి వచ్చిన ఫోన్ తో గుర్తోచిన వాస్తవం తో కలిపి)

కిషోర్
కుమార్ గొంతు, శాయిరిలా సోగుసులు
ఊహల మేడలు, కలవరింపు కలలు
ప్రతి మత్తులో గమతులు
అన్నింట్లో శివం, సుందరం
కాని...
అదంతా క్రీస్తు పూర్వం
పునర్జన్మ ఉంది.
అర్థాలు మారిన ఆశలు
విసిగిస్తున్నఆలోచనలు
బాధ్యతా ముసుగులో కావలసినంత బదకం
పారిపోయేందుకు కావలసినంత తెలివి
దుమ్ముపట్టిన కాసెట్సే,
మూగా బోయిన స్పీకర్లు
పిల్లల ఆటలో చిరిగిపోయిన గుర్తులు
బాస్ కోసం, బన్నీ కోసం, ఇంటి కోసం, చంటి కొసం,
...మల్లి పుట్టలేమో మన కొసం