Wednesday, July 29, 2009

పది సంవత్సరాలు అయిపోయాయి, కాలేజీ వదిలి. దశాబ్ధములో ఎంత మార్పు.
ఎ జి కాలేజీ, రాజేంద్ర నగర్, బి - హాస్టల్ ఫ్రెండ్స్ పార్టీ లో
కలిసి నవ్వుకొని, ఆ రాత్రంతా తనివీ తీర (జ్ఞాపకాలని) తాగిన ఆ రోజు గుర్తుకోసం..., (తెల్లారే ఇంటినుంచి వచ్చిన ఫోన్ తో గుర్తోచిన వాస్తవం తో కలిపి)

కిషోర్
కుమార్ గొంతు, శాయిరిలా సోగుసులు
ఊహల మేడలు, కలవరింపు కలలు
ప్రతి మత్తులో గమతులు
అన్నింట్లో శివం, సుందరం
కాని...
అదంతా క్రీస్తు పూర్వం
పునర్జన్మ ఉంది.
అర్థాలు మారిన ఆశలు
విసిగిస్తున్నఆలోచనలు
బాధ్యతా ముసుగులో కావలసినంత బదకం
పారిపోయేందుకు కావలసినంత తెలివి
దుమ్ముపట్టిన కాసెట్సే,
మూగా బోయిన స్పీకర్లు
పిల్లల ఆటలో చిరిగిపోయిన గుర్తులు
బాస్ కోసం, బన్నీ కోసం, ఇంటి కోసం, చంటి కొసం,
...మల్లి పుట్టలేమో మన కొసం












Wednesday, April 15, 2009

మ్యూజింగ్స్

గడిచిన కాలం, మరిచిన గతం
నీ మనుసును తట్టి, కలలో వచ్చి
ఓడిన క్షణం, గెలిచిన జ్ఞాపకం
పిల్ల తేమ్మరై, నీ మదినే తాకి
నీ పెదవిని చేరి చిరునవ్వై నిలిచే
ఆనందం మించి విజయమున్తుందా
అది అమ్రుతమై వెంట వచ్చుకదా

పోటి ముఖ్యం - ఓటమి అవసరం

" గెలుపు, ఓటమి అసలు ముఖ్యమే కాదు, మన కిష్టమైన పోటిలో మనము ఉన్నామా లేదా అనేదే ముఖ్యం", అని త్రిపురనేని శ్రీనివాస్ అనట్టు గుర్తు.
ఓడిపోవడం చాల పెద్ద తప్పు, సక్సెస్ లేకపోతే జీవితం అనవసరం అని సిదాంతాలు పాతుకుపోతున్నతరుణం. చిన్నచిన్న గేమ్ షో లో తిట్టుకోవడం, ఏడవడం, ఏమైనా సరే గెలవాలనుకోవడం, ఎలాంటి వ్యక్తిత్వం అయిన సరే గెలిచినవాడే గొప్ప వాడనడం, కచితంగా తప్పుడు సంకేతాలే. నెక్స్ట్ జనరేషన్ పుట్టిందే సక్సెస్ కోసం అని ఆల్రెడీ డిసైడ్ చేసేసాం. ఎంత పెద్ద decission అంటే, గెలవకపోతే జీవితం వేస్ట్ అనేంత.

జీవించడమంటే మనల్ని మనం గెలవడం. పక్కవాడి కోసం, పక్కవాడి మీద గెలవడం కాదు.
"సరే అల గెలుచుకుంటూ వెళితే అంతు ఉంటుందా, అది నిజంగా బాగుంటుందా", అని ఆలోచిస్తే వచిందే కింది కవిత ....

ప్రతి రోజు ప్రతి కిరణం నిన్నే పలకరిస్తుందా
అవకాశం ఎంత వరకో, అవసరం సర్దుకోలేవ
కలలన్ని నిజలయిపోయి, కళ్ళెదుటే విజయమయి వచ్చి
ప్రతి గెలుపు నీ ముందు నిలిస్తే, నాటకం రక్తి కడుతుందా
ఓటమే లేని పోటిలో ఆశ ఆసక్తి ఉంటుందా