Wednesday, June 20, 2012

సత్యమే శివం...


మిత్రుడు నరేంద్ర గారు నాకు పంపించిన ఒక టపా. 
"సత్యమే శివం..ఒక phd చేయ తగ్గ సినిమా అది..దాని ప్రభావం మన మీద ఉండడం మంచిదే..సత్యాన్వేషణ ఈ విధంగా సాగించడం లో కొంత మనశ్శాంతి ఉన్నట్టు అనిపిస్తుంది..
నేను శివం 
నీవు  శివం 
నేనే శివం ...(నాస్తికులకు సత్యమే శివం) 

సత్యమే శివం
అను మంత్రమే పథం
సత్యమే శివం
అను సత్యమే నిజం

సత్యమే శివం
అది మనకహర్నిశం
సత్యమే శివం
అది మతం, అభిమతం"
(courtasy : narendra pall)
 
 సత్యమే శివం లో పాట ...నన్ను ఎంతో  ఆలోచింప చేసే పాట. 
 
నేనే శివం, నీవు శివం ! సత్యం శివం, స్నేహం శివం !! 
ఆస్తికులైన హితులందరికి, శివమే సత్యమట ! 
నాస్తికులైన స్నేహితలుకు ఆ సత్యమే శివమంట !! 
సత్యం శివం స్నేహితం సత్యం శివం జీవితం నేనే శివం, 
సాటి మనిషికి సాయం చేసే మతమే నీ మతము 
మానవ సేవే మాధవ సేవను హితమే సమ్మతము 
సత్యం శివం సత్యం శివం జీవితం సత్యం శివం సత్యం శివం జీవితం 

2 comments:

palla narendra said...

'వంశి'ని ఇటునుండి చూస్తే సత్యం..అటునుండి చూస్తే 'శివం'

మరో మాట..మోన్న ఒక మిత్రునితో పంచుకున్న తలపు

తలపు ఎదగాలంటే..
మనిషికి ఒక ఉనికి కావాలి..
ఆ ఉనికి దానంతకి అది అలా రాదు..
ఉనికి కై ఎవరికి వారు తమంతకి తామే కదలాలి..
ఉనికిని తెలుసుకోవడమె సత్యాన్వేషణలో తొలి అడుగేమో..
అలా తెలిసిన ఉనికిని నిలుపుకోవడం సత్యశోధన లొ మలి అడుగేమో..
అదే ఉనికి కలిగిన తోటి సత్యాన్వేషులను కనుగొంటే సత్యార్థిగ మరో అడుగేమో..
అలా మనకి మన ఉనికికి అడుగడుగునా సాగె దాగుడుమూతె సత్య సందర్షనమేమో..

Vamshi Pulluri said...

నిజమే.!
అందుకే మనం మన నమ్మకాన్ని నిజమని కనుగొనే దశ లో, ఆ దిశలో (పుస్తకం చదివెప్పుడో, ఒక సినిమ చూసెప్పుడో, మన పనిలో అది కనపడ్డప్పుడో, మిత్రుల తో పంచుకున్నప్పుడ్డో, వాల్లతో వాదించినప్పుడో) ..అలా అడుగు, అడుగులో, ప్రతి అడుగులో కొత్త సూత్రాలు, సిద్దంతాలు, అశ్చర్యాలు దొరకవచ్చు.. మీరన్నట్టు అంతిమ సత్యం ఎప్పుడు దోబుచులాడవచ్చు.

మీరు ఎప్పటికప్పుడు కొత్తగ ప్రింట్ అయ్యే పుస్తకం..! (లాంటి వారు కాదు, పుస్తకమే).