Friday, June 15, 2012

ఓడిన ఎన్నికలు..

ఉప ఎన్నికల రిజల్ట్స్ అనుకొన్న మాదిరిగానే వచ్చాయి. అయితే రిజల్ట్స్ ముందు జరిగిన టి.వి. చర్చలలొ మన నాయకులు, విశ్లేషకులు నితి సూత్రాలు కొన్ని వల్లించారు. అందులో మొదటిది "డబ్బు పంపిణి".

పెద్ద ఎత్తున జరిగిన డబ్బు పంపిని.., ఓట్లు మారకుండ ఉండెందుకే ఉపయోగపడ్డట్టున్నాయి. డబ్బు తీసుకొన్నవాడు ఓట్లు వేస్తాడనే నమ్మకం కన్న, డబ్బులు పంచకపోతే మనకు రావల్సిన ఓట్లు కూడ రావనే భయం పార్టీ లకు ఉంది.  డబ్బు పంచక తప్పని పరిస్తిథి. అలాంటప్పుడు తప్పు రాజకీయ నాయకులది ఎలా అవుతుంది. మరో అంశం కులం.. ఎన్నికలలో గెలుపు ఓటములు ఎక్కువగ కులాల సమికరణాలపైన అధర పడే పరిస్తితి.., జనాభిమానమున్న నాయకుడైన, అత్మాభిమనమున్న నాయకుడైన, ప్రజా నాయకుడైన, ఉత్తిపున్యానికి నాయకుడైన వీటి మీద "మాత్రమే" అధారపడే పరిస్తితి.. ఇప్పుడు గెలిసిన వై.ఎస్.ఆర్ అభ్యర్తులను చూస్తే..    M. R. రెడ్డి (నెల్లూర్), B.K. రెడ్డి (తిరుపతి), గుర్నత రెడ్డి (అనంతపుర్), K.R. రెడ్డి (రాయదుర్గం),M. Ch.K. రెడ్డి (ఎమ్మిగనుర్), S.N.రెడ్డి (అళ్ళగడ్డ), A. రెడ్డి (రాజం పెట), G.S.రెడ్డి (రాయచొటి), M.Ch. రెడ్డి (ఉదయగిరి), B.S.రెడ్డి (ఒంగోల్), M.S.రెడ్డి (పత్తిపాడు).....
ఇది జనాలు, నాయకులు కలిసి పోషించుకొంటున్న సంస్కౄతి..! జగన్ కోసం, వై. ఎస్. ఆర్ కోసం జనాలు ఓత్లు వేసరు అనుకుంటే..పై నున్న సమీకరణాలు వెరుగ ఉండవచ్చు కధ.! తను ఎలాంటి వాడైన పైనవి తప్పవని  చెప్పడమే నా ఉద్దేశం.      

ఇవే కాకుండా.., తాత్కాలిక సెంటిమెంట్లు, ప్రలోభ పతకాలు, ఊర్లో గుడి చందాలు, పిల్లలకు క్రికెట్ కిట్లు, చీరలు, నగలు, మద్యం ....కొత్త వాడికి చాన్స్ ఇద్దామని, పాత వారిని  మార్చుదామని తప్ప నచ్చేవారే లేని ఎన్నికలు ఎన్నిసార్లు వచ్చిన అవి ఓడిపోతాయి...


 

2 comments:

మన"సు"భాషణం said...

Sorry Boss.. మీ అభిప్రాయంతో నేను ఎకీభవించట్లేదు. ఓడిపోయేవి ఎన్నికలు కాదు.. మూర్ఖులయిన, కులకాముకులయిన వోటర్లు.. వళ్ళని చైతన్యపరిచే ఆలొచన, మేధా శక్తి వుండికూడ మనకెందుకులే అని మూసుకుని కూర్చుంటున్న చేవలేని దద్దమ్మలైన చదువుకున్న తెలివిలేని మేధావులు.

Vamshi Pulluri said...

మన"సు"భాషణం గారికి, ప్రజలు ఓడిపొలేదు.. అలా ఎందుకన్నాను అంటే..ఇలాంటి సిస్టం ని పెంచి పొషిస్తున్నది వారే కాబట్టి., వారు కొరుంకొంటున్నది అదే అనిపిస్తుంది కాబట్టి.! మన కోసం వచ్చె ఎన్నికలను, మనం ఉపయోగించుకోకుండ., వాటిని ఓడిస్తున్నము అని నా ఉద్దెస్ష్యం..మీ అభిప్రాయం పంచుకొన్నందుకు థాంక్స్ బా"సు".