Thursday, June 2, 2011

ఆదివారం రంగోలి

AG కాలేజీ, రాజేంద్ర నగర్, బి హాస్టల్ లో ...టిఫిన్ అయిపోతుందంటే ఎ ఎనిమిది, తొమిది గంటలకో లేచేది, సండే మాత్రం పొద్దున ఆరు గంటలకే లేచి, సెవెన్ హిల్స్ లో టీ తాగి, టివి రూం లో సెటిల్ అయ్యి DD లో (దూర దర్శన్ - అదృష్టం బాగుండి, అ ఒక్క ఛానల్ మాత్రమే వచ్చేది, ఇది 94-98 లో మాట) రంగోలి చూస్తుంటే ఆహ, ఆ మత్తు ఆ వారమంత ఉండేది. పాత హిందీ పాటల పరిచయం నాకు అక్కడే. ఎన్ని కాస్సేట్ట్స్, ఎన్ని సాంగ్స్... ఒక్కో సాంగ్ రోజుకు పది సార్లు విని, ఇరవై సార్లు పాడుకోని, వందల సార్లు ఆహ అనుకోని..ఆహ! పాటల్ని ప్రేమించి, అనుబవించి, పాటల్నోని ప్రేమని అనుబవించడానికి, అమ్మాయిల్ని ప్రేమించి, ఓహో!! అప్పుడప్పుడు సాయంత్రం హాస్టల్ పైన, పార్టీలలో విరహ గీతాలు, శ్యాం గాడి తెలుగు ప్రేమ గీతాలు (కొందరి కోరిక మేరకు), వాటిలో నంజుకోవడానికి గిల్బీస్ గ్రీన్ లేబిల్. ఇదంతా గుర్తుకు వచ్చి గూగుల్ లో వెదికితే మంచి పాట దొరికింది. క్రింద ఇచ్చిన పాట క్లిక్ చేసి చూడండి, మీరు ఎంజాయ్ చేస్తారు.
http://www.youtube.com/watch?v=lhxG1NMZITI

1 comment:

Praveen Mandangi said...

ఇక్కడ అడ్వర్టైజ్ చేస్తున్నందుకు క్షమించాలి. తెలుగు బ్లాగర్లకి గమనిక. మా అగ్రెగేటర్ తెలుగు వెబ్ మీడియా - కెలుకుడు బ్లాగులు గానీ బూతు బ్లాగులు గానీ లేని ఏకైక సకుటుంబ సపరివార సమేత అగ్రెగేటర్ http://telugumedia.asia యొక్క సర్వర్ ఇండియన్ డేటా సెంటర్‌లోకి మార్చబడినది. ఈ సైట్ ఇతర దేశాల కంటే ఇండియాలో మూడు రెట్లు వేగంగా ఓపెన్ అవుతుంది. భారతీయుల కోసమే ఈ సౌలభ్యం. మీ సైట్‌ని మా అగ్గ్రెగేటర్‌లో కలపడానికి administrator@telugumedia.asia అనే చిరునామాకి మెయిల్ చెయ్యండి.
ఇట్లు నిర్వాహకులు