Thursday, September 8, 2011

పోరాటం పై పోరాటం


"అవినీతి పోరాటం" పై అలుపెరుగని "పోరాటం" చేస్తున్న మేదావుల ఆంతర్యం అసలు అర్దం కావడం లేదు. ఈ పోరాటాలు, వాటి తీరు నచ్చలేదు, ఇలా కాదు ఇలా చేయలి అంటే విషయం అర్దం అవుతుంది. కాని వాటిని, చేస్తున్న వారిని అంతగా "అసహ్యించుకోవల్సిన" అత్యవసర ఆగత్యం, దాని "అంతర్యం" అర్దం కాలేదు. అరుందతి రాయ్ మట్లాడిన, అరుణ రాయ్ మాట్లాడిన, అన్నా చెప్పిన, ఎవరెవరు ఏది చెప్పిన వారు చూపిన, చూపిస్తున్న కల, అశయం చాలమందికి స్పుర్తిని ఇచ్చిన మాట వాస్తవం. టి. వి,. లో ఆ తతంగం చూసినపుడు నేను నవ్వుకొన్న మాట నిజం కావచ్చు. "మానవ హక్కులే", అవినీతి కంతె పెద్ద సమస్య అని నమ్మినవాడినే. కాని ఇలా అర్జంటుగా విరుచుకుపడి విషం చిమ్మలేదు. "మద్య తరగతీ ని ఒక మూర్కపు సమజానికి ప్రతి రూపంగ, అత్యాసపరులైన అవకాశవదులుగా, చిత్రీకరించడం మహ మేదావులకు అలవాటైపొయింది. ఈ విమర్శలలో మరో కోణం "నా/ మా పోరటాలు మత్రమే మీరు చేయలి, మీరు మరేది చేసిన అది కూహన స్వార్దమే" అనడం.. ప్రతి ఒక్కరికి తెలివి లేని దద్దమైన సరే, వాడికి నచ్చే పొరాటనికి మద్దతు ఇచ్చే కనిస హక్కు ఉంది.

No comments: