Cambodia విశేషాలు:
WWF -India లో చేరిన తరువాత నాకు మొదట వఛ్చిన విదేశీ యాత్ర అవకాశం, "పాకిస్థాన్". పాకిస్థాన్ సింధ్ ప్రాంతం లో బహ్వలాపూర్ జిల్లా లో అక్కడి "పాకిస్థాన్ సుస్థిర పత్తి" ప్రోగ్రామ్ ను సందర్శించే అవకాశం వచ్చింది. దాదాపు వారం కు పైగా అక్కడ అనేక గ్రామాలు తిరిగే అవకాశం, అక్కడి ప్రజలతో మాట్లాడే అవకాశం దొరికింది. అదో నిజంగా గొప్ప అవకాశం. రోజుకో కొత్త అనుభవం తో పాత పొరలు తొలగించుకునే అవకాశం. అదే సమయం లో వరంగల్ లో మేము చేస్తున్న ప్రోగ్రాం చూడడానికి పాకిస్తాన్ బృందం రావడం. రెండు ప్రోగ్రామ్ లు నిజంగా పోటాపోటీ గా నిలిచి, ఎన్నో కొత్త దారులను తెరిచాయి.
అది దాదాపు 13 సంవత్సరాల కింద మాట. అప్పటి పత్తి ప్రోగ్రామ్, పెరిగి పెద్దద్దై 21 దేశాలు విస్తరించి, దాదాపు 20 లక్షల మంది రైతులతో "better cotton" గా రూపాంతరం చెందడం, అనేక మార్పులు, దేశ, విదేశాల రైతులతో,సంస్థలతో, శాస్త్రవేత్తలతో, కంపెనీలతో నిరంతరం చర్చలు, సమావేశాలు..
అలాంటి మీటింగ్ ఈ సంవత్సరం "కంబోడియా" లోని, Siem Reap పట్టణం లో జరిగింది. ఈ సారి విశేషం (నా మటుకు), panel board లో బయోడైవర్సిటీ expert గా పిలవడం. కంబోడియా అనగానే కొంత మంది అది ఆఫ్రికా దేశామా, అమెరికా కి దగ్గరా అని అడిగారు. కాదు.., మన దేశం దగ్గర్లోనే ఉన్న చిన్న దేశం (Southeast Asia ). కోటిన్నర జనాభా (చాలా తక్కువ కదూ ) ఉన్న దేశం.
కంబోడియా అనగానే చాలా మందికి గుర్తుకు వచ్ఛేది, - Angkor Wat దేవాలయం. ప్రపంచంలోనే పెద్ద హిందూ (విష్ణు) దేవాలయం. మేము ఉన్న siem reap కి అతి దగ్గరలోనే ఉంది. ఎక్కువగా బౌద్ధ మతం ఉండడం వలన, Angkor , Bayon దేవాలయాల వలన ఇక్కడ పర్యాటకులు ఎక్కువే.
కంబోడియా దేశం చాలా సౌమ్యమైనదైనా వియాత్నం-అమెరికా యుద్ధం వలన మధ్యలో చాలా నలిగిపోయింది. వియత్నాం దేశం, ఈ దేశం భూభాగాన్ని వాడుకోవడం, అందుకు ప్రతీకారంగా అమెరికా బాంబింగ్ చేయడం వలన కంబోడియా చాలా నష్ట పోయింది. ఆ తరువాత దేశం లో రాజకీయ మార్పులు జరగడం, ఇప్పటికి ఇన్నాళ్ళకి ఆ దేశం కొంత కుదుట పడుతుంది. వ్యవసాయం, textiles , పర్యటకం పైన ఎక్కువగా ఆధార పడ్డ దేశం.
మేము ఉన్న Siem Reap కూడా మంచి పర్యాటక ప్రాంతం. మొత్తం ఎక్కడ చూసినా పర్యాటకులే. మంచి హోటల్స్, తక్కువ లోనే దొరుకుతాయి. ఉన్న వరం రోజుల్లో ఎంతో మంది indian tourist లను చూసాను, కాకపోతే, వారు ఎక్కువగా senior citizens. దేవాలయం చూడడానికి వస్తున్నారేమో. Angkor Wat దేవాలయం చూడాల్సిన ప్రాంతం. 12 వ శతాబ్దం లో Jayavarman రాజులు కట్టించిన దేవాలయం. ఆ దేవాలయ సముదాయం లో "విష్ణు" ప్రధాన దేవుడు కాగా, తొమ్మిది ప్రాంగణాలు ఉన్నాయి, అవి ఒక్కొక్కటి ఒక్కో అవతారానికి ప్రతీక అని మా గైడ్ చెప్పాడు. పాలసముద్రం మధ్యలో శేషతల్పం పైన విష్ణు కొలువై ఉంటాడని నమ్మకం కావునా, ఆ గుడి మొత్తం angkor నది మధ్యలో (చుట్టూ నీరు) ఉంటుంది. నది ధాటి మధ్యలో వెళ్ళడానికి ఉన్న వంతున ఏడూ తలలు ఉన్న నాగుపామును పోలి ఉంటుంది. ప్రధాన దేవాలయం మూసి ఉంటుంది, అయినా ఆ దేవాలయం గర్భగుడి లోకి వెళ్లాలంటే కొండ ఎక్కినట్టు ఉండే మెట్లు ఎక్కడం కష్టమే. గుడి చుట్టూ ఉన్న మండపాలలో దశావతారాల కథలు చాలా బాగా చెక్కి ఉన్నాయి. ఇప్పుడు అక్కడ కొన్ని బుద్ధుని విగ్రహాలు ఉన్నాయి, వాటికీ పూజలు జరుగుతున్నాయి.
జయవర్మన్ వంశం దాదాపు 4 శతాబ్దాలు పాలించిన తరువాత పతనమయినది. ఆ తరువాత బౌద్ధ మతం ఎక్కువ ప్రాచుర్యం పొందింది. అక్కడ మాతో గైడ్ చెప్పినట్టు, మెదడు లో బౌద్ధమత సారాంశం, గుండెలో హిందూమత విశ్వాషం వారికి ఉంటాయని చెప్పింది నిజమేనేమో అనిపించింది, అక్కడి పూజ విధానం చూస్తే. అలాగే Bayon దేవాలయాలు. చూస్తే హిందూ దేవాలయాల లాగే ఉన్న, అవి ఒకప్పటి బౌద్ధ ఆరామాలు.
వీటితో పాటు మేము దగ్గర్లోనే ఉన్న "Tonle Sap Lake" లో సూర్యాస్తమయం చూడడానికి వెళ్ళాం. అక్కడ "floating village" ఒక ఆకర్షణ. కాకపోతే మేము వెళ్లిన సమయం (జనవరి నెల) లో నీళ్లు తగ్గడం వలన ఆ గ్రామం తేలట్లేదు. భూమి పైనే నిలిచి ఉంది. కర్రల దూలాల పై నిలిపి రెండో/ మూడో అంతస్థులో ఇల్లు కట్టి ఉంటాయి. దాదాపు 1500 Fishing Community నివసిస్తూ ఉన్నారు. ఎక్కువ రోజులు నీరు నిలిచి, స్థానిక నది, TonleSap lake వరద నీరు చేరడం వలన కింద దూలాలు మునిగి, రోడ్లు మునిగి, ఇల్లు నీటిలో తేలియాడుతూ కనిపిస్తాయి. అక్కడ గుడి, మంచి బడి, కొత్తగా చర్చి వచ్చ్హాయి. TonleSap లేక్ కూడా మంచి అనుభవం. సరస్సు మధ్యలో తేలియాడే రెస్టారెంట్ లోకి తీసుకెళ్లి ఒక గంట పర్యాటకులను వదిలేస్తారు. ఆ రెస్టారెంట్ మెల్లిగా కదులుతూ ఉంటె మనం ఫుడ్, బీర్, తీసుకొంటూ సూర్యాస్తమయం చూస్తూ ఎంజాయ్ చేయొచ్చూ.
ఇవి తప్ప అక్కడ మరో పెద్ద ఆకర్షణ, "Pub street". దీన్నే Night street / Old Market అని కూడా పిలుస్తారు. నాతో వచ్చిన దినేష్ (Deshpande Foundation ), దాన్ని "china version అఫ్ Bangkok" అన్నాడు. అవును చాలా తక్కువ ధరలో ఎంజాయ్ చేసే అవకాశం ఉన్న street . చాలా లైవ్లీ గా ఉంది. సాయంత్రం ఏడూ తరువాత ప్రాణం పోసుకొని, తెల్లారేవరకు ఊగుతూ ఉంటుంది. అంత ఉన్నా, ఎక్కడ మాకు (ఆ వారం రోజుల్లో) చిన్న పాటి గొడవ కనపడలేదు. బౌన్సర్లు లేరు, పోలీసులు అసలే లేరు. అవసరం అంతకన్నా కనపడలేదు. టూరిస్ట్ లు తింటూ, తాగుతూ, డాన్సులు చేస్తూ, ఊరికే స్ట్రీట్ మొత్తం అటూ , ఇటూ తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
అక్కడ దొరికే ఫుడ్ ఇంకా గమ్మత్తు. ఆ స్ట్రీట్ లో రోడ్ పైన మెళ్ళో ట్రే వేలాడదీసుకొని అందులో మంట పైన కాల్చిన "తేలు, సాలీడు, చిన్న పాములు, పురుగులు (bugs)" అమ్ముతూ ఉంటారు. కొని తింటే 1 డాలర్, ఊరికే ఫోటో తీసుకొంటే, 0.5 డాలర్. ఏవ్ కాదు రోడ్ పైన కూడా "చీమలు, Bugs " వీయించి అమ్మడం చూసా..
PUB street లో ఉండే pub లలో మాత్రం మరో రకం food దొరుకుతుంది. 12 రకాల మాంసం తో ఉండే BBQ. ఆ పన్నెండు రకాలలో "Crocodile. కంగారు. కప్పలు" పెద్ద ఆకర్షణ (?). అయితే అక్కడ ఫుడ్, drink చాలా తక్కువ ధరలో దొరుకుతుంది. గ్లాస్ బీర్ సగం డాలర్ లో దొరుకుతుంది. తాగితే నీళ్లు తాగినట్టే ఉండడం అది వేరే విషయం. కాకపోతే అక్కడ మంచి Indian food దొరికే రెస్టారెంట్ లు కూడా దాదాపు ఆరు వరకు ఉన్నాయి. మేము "వణక్కం" కు ఫిక్స్ అయిపోయి, వారం రోజులు మంచి ఫుడ్ తిన్నాం. ఆ హోటల్ ఓనర్, బొంబాయి లో తన బిజినెస్ మానుకొని, ఇక్కడకు వఛ్చి సెటిల్ అయ్యాడు. ఇక్కడ చాలా ప్రశాంతంగా, సంతోషంగా ఉందని చెప్పాడు. తనతో పాటు ఇంకొంతమంది ని తీసుకొచ్చ్చి, కొత్త హోటల్స్ కూడా మొదలు పెట్టాడు. పేరు చూసి తమిళ్ అనుకోవద్దు. అతడి వ్యాపారం చూసి తెలుసుకోవచ్చూ, అవును అతను మలయాళీ.
ఇంత రాసిన ఇంకొకటి మిగిలిపోయింది. ఇంతకుముందు చెప్పినట్టు, ఇదో Bangkok కు ఇమిటేషన్ .. పబ్ ల మధ్యలో చిన్న, చిన్న మసాజ్ సెంటర్ లు. పెద్దగా ఉహించుకోవద్దు. ఫుట్, బాడీ, ఆయిల్ మసాజ్ లు, థాయ్ మసాజ్ లు పదో వంతు ధరలో ఉంటాయి. ఇంతకంటే ఎక్కువ విషయం కావాలంటే గూగుల్ లో వెతుక్కోవాలి. ఇక్కడ లీగల్ గా అనుమతి మసాజ్ వరకే.
ఇండియా తిరిగి వచ్ఛేప్పుడు సింగపూర్ మీదుగా రావడం జరిగింది. సింగపూర్ విమానాశ్రయం నాలుగు టెర్మినల్ తో చాలా పెద్ద విమానాశ్రయం. సింగపూర్ ఎయిర్లైన్స్ లో ప్రయాణించే వారికి ట్రాన్సిట్ మధ్యలో సమయం ఉంటె "ఉచిత సింగపూర్ టూర్" అవకాశం వినియోగించుకోవచ్చూ. టూర్ లేకపోయినా పర్వాలేదు, విమానాశ్రయం లో బోలెడు కాలక్షేపం. ఉచిత సినిమా హాల్ ల తో పాటు, butterfly garden (చాలా బాగుంది), కొత్తగా కట్టిన "Jewel గార్డెన్ (అద్భుతంగా ఉంది) లాంటి కాలక్షేపం కూడా ఉంది.

ఇదే నా మొదటి ట్రావెలోగ్.
ఇంత వరకు చదివివుంటే చాలా థాంక్స్,
(కంపూచియా దేశం, మన యాసలో కాంబోజ దేశం- జయవర్మన్ వంశం తరువాత దేవాలయాలు మరుగునపడి చెట్లు, అడవులు పెరిగిపోవడం, క్రమంగా దేశ ఆచారాలు, మాట విశ్వాశాలు మారడం, బౌద్ధం పెరగడం వలన హిందూ మతం తగ్గిపోయింది. కౌండిన్య యువరాజు కంబోడియా రాణి సోమా ను పెళ్ళాడి, కంబుజ దేశంగా పేరు మార్చాడు. కౌండిన్య తన భార్య దేశానికి వచ్చాడు కాబట్టి, ఇప్పటికి పెళ్ళైన తరువాత భర్తలు, భార్యల ఇంటికి వెళ్లే ఆచారం ఉందట. మా గైడ్ ఆ విషయం చాలా భాధగా చెపుతూ, తాను అలానే రెండేళ్లు వెళ్లి, సొంత సంపాదన తో బయటకు రాగలిగానని చెప్పాడు. కానీ అక్కడ ఆడవారు ఇప్పటికి కష్టపడుతూ కనపడతారు. ఏ షాప్ లోకి వెళ్లినా వారే అన్ని చూసుకొంటూ కనపడుతున్నారు. )
--

No comments:
Post a Comment