నా లాగె, సముద్రం
ప్రేమను అలలా చేసి
తన కాళ్ళను తడిపింది..
తానూ కాళ్ళను తుడుచుకొని వెళ్ళిపోతే
గంభీరంగా వేనేకే నిలిచింది.
ఆవేశామైన, ఆహ్లాదమైన
అల ఒకటే తన భావమైంది
సరదాగా ముంచెత్తే
ఉప్పన ఒకటే తన భాష అయింది
సుడులు తిరిగే బాధనంత
గుండెలోనే దాచుకుంది
నా కోసం అది అద్దం అయి నిలిచింది
నా మనుసు లోతు కొలిచి చూపింది
5 comments:
good one
Thanks Padmarpita
Very Nice bro
చాల రొమాంటిక్ గా చెప్పారు సర్
Post a Comment