Wednesday, April 15, 2009

పోటి ముఖ్యం - ఓటమి అవసరం

" గెలుపు, ఓటమి అసలు ముఖ్యమే కాదు, మన కిష్టమైన పోటిలో మనము ఉన్నామా లేదా అనేదే ముఖ్యం", అని త్రిపురనేని శ్రీనివాస్ అనట్టు గుర్తు.
ఓడిపోవడం చాల పెద్ద తప్పు, సక్సెస్ లేకపోతే జీవితం అనవసరం అని సిదాంతాలు పాతుకుపోతున్నతరుణం. చిన్నచిన్న గేమ్ షో లో తిట్టుకోవడం, ఏడవడం, ఏమైనా సరే గెలవాలనుకోవడం, ఎలాంటి వ్యక్తిత్వం అయిన సరే గెలిచినవాడే గొప్ప వాడనడం, కచితంగా తప్పుడు సంకేతాలే. నెక్స్ట్ జనరేషన్ పుట్టిందే సక్సెస్ కోసం అని ఆల్రెడీ డిసైడ్ చేసేసాం. ఎంత పెద్ద decission అంటే, గెలవకపోతే జీవితం వేస్ట్ అనేంత.

జీవించడమంటే మనల్ని మనం గెలవడం. పక్కవాడి కోసం, పక్కవాడి మీద గెలవడం కాదు.
"సరే అల గెలుచుకుంటూ వెళితే అంతు ఉంటుందా, అది నిజంగా బాగుంటుందా", అని ఆలోచిస్తే వచిందే కింది కవిత ....

ప్రతి రోజు ప్రతి కిరణం నిన్నే పలకరిస్తుందా
అవకాశం ఎంత వరకో, అవసరం సర్దుకోలేవ
కలలన్ని నిజలయిపోయి, కళ్ళెదుటే విజయమయి వచ్చి
ప్రతి గెలుపు నీ ముందు నిలిస్తే, నాటకం రక్తి కడుతుందా
ఓటమే లేని పోటిలో ఆశ ఆసక్తి ఉంటుందా

1 comment:

కమనీయం said...

yes,I agree.One should strive againstobstacles and difficulties and not against individuals.Success is a prize one may or maynot achieve.
ramanarao