అశల చిగుర్లకి పచ్చని రంగు వేసి
పాత కలలకు కొత్త చొక్కా తొడిగి
అంతులేని దైర్యం అప్పుగా తెచ్చుకొని
మాటలకు అరువు పదాలు అతికించి
అర్థం కాని కొత్త కథల నేడు నేను..,
భయానికి అచ్చమైన అర్థంగా
అమాయక విశ్వాసాల ప్రతిరూపంగ
మొలకెత్తని నాటు విత్తనముల
సొంత సంతోషాల, చిన్న చిన్న ఆనందాల
ఊరి మట్టి తో నా సొంత్త పేరు లా నాడు నేను