Tuesday, July 10, 2018

కాల జ్ఞానం

గడిచిపోయిన కాలమెంత.. ఎగిరిపోయిన క్షణికం
నడుస్తున్న కాలమింకెంత .. అందనంత దూరం
ఇంకా పొడవని కాలమెలా .., తేలాల్సిన భారం 

Wednesday, March 7, 2018

ఆలోచనల పై ఒక ఆలోచన

ఆలోచనలు ఒక క్రమ పదతిలో ఉండాలా., వాటికి ఏదైనా ఒక అమరిక అనేది ఉంటుందా.! విచ్చలవిడిగా వచ్చే , వచ్చి పోతుండే ఆలోచనలను అదుపు చేయాలా?
నా ఆలోచన ప్రకారం, ఆలోచన లను అదుపు చేయడమనే ప్రక్రియ లేదు. ఆలోచనలను ఆపడం అంటే, మనల్ని మనం ఒక భ్రమ లో ఆలోచన ను దారి మళ్ళించడానికి చేస్తున్న విశ్వ ప్రయత్నం. అంటే "ఆలోచించకుండా ఉండే విషయం" గురించి బుర్ర నింపుకోవడం. నువ్వు గట్టిగ పాడినప్పుడో, ఏదో ఒకటి అంటునప్పుడో (ధ్యానం లో శ్లోకం లాంటివి) అప్పుడు తాత్కాలికంగా ఆలోచన ని అదుపు లో ఉంచే ప్రయత్నం చేయగలం. కాని ఆలోచన ఒక క్రమ పద్ధత్తిలో లేకపోవడం మనల్ని పూర్తి స్థాయి కన్ఫ్యూషన్ లో ఉంచుతుంది కదా. దారి తెన్ను లేని ఆలోచన మనకు ఎటువంటి ఉపయోగం ఇవ్వగలదు. అంటే ఆలోచనల్ని అదుపు లో చేయడం కంటే, ఒక సూత్రానికి, ఒక మూలానికి అటుఇటు గా ఉగిసలాడే విధంగా ఆలోచనలను తీసుకురాగలిగితే, అదే ఒక స్కిల్ అవగాలుగుతుంది. అది మంచి ఆలోచన, చెడు ఆలోచన అవుతుందో తెలియదు కాని, ఉ ఆలోచించే విషయం పై నీకు గా, నీకు ఒక పట్టు వస్తుంది. అందుకనే ఆలోచన రాగానే, దాన్ని రానివ్వాలి. మనకు ఆ విషయం పై మనం నమ్మే మూలా సూత్రం, మనకు ఉన్న కోరిక, మనకున్న ఆరాటం చుట్టే ఆ ఆలోచన తిరగాలి. అది అలా తిరుగుతూనే ఉండొచ్చు. మనం ఆ ఆలోచన ను "Express" చేసినప్పుడు (అంటే బయటకు చెప్పినప్పుడో, మన attitude లో చుపించినప్పుడో, ఆచరణ లో పెట్టినప్పుడో) మాత్రం, ఆ ఆలోచన పై మన సాధికారత, స్పష్టత తెలియాలి. "భయం" అవుతునప్పుడు (నేను భయపడ కూడదు, భయపడకుడదు అని పదే పదే సార్లు అనుకోవడం కన్నా) భయపడడమే మంచిది. ఎందుకు భయ పడుతున్నమో, అందులో మన నష్టో ఏంటో, మన౦ అపగాలిగినదా, తట్టుకోగాలిగినదా, ఇప్పట్లో తిరిపోయేదా అనే స్పష్టత ఉంటె చాలు. నిజానికి ఇది "ఆలోచన" లకు పూర్తి స్వాతంత్రం ఇవ్వడం వంటిది. ఘర్షణ లేనిదే స్వేచ్చ లేదు. ఘర్షణ లేనప్పుడు వస్తువు ముందుకు ఎలా కదలకుండా జారిపోతుందో, ఇది అలాగే. ఆలోచన ల ప్రతిరూపం మంచి, చెడు ఉండొచ్చు. కాని మంచి, చెడు అని ఆలోచనలని విడదియకపోవడమే మంచిది.

Sunday, June 5, 2016

ఓడిపోని గెలుపు

మీలో ఒకడి నయ్యే ప్రమాదముందని 
భూమి పై నిలబడకుండా 
కళల కలలో ఎగురుతూ
చేరిందేక్కడో.. 
అక్కడ జీవితం ఉందో లేదో తెలియని 
అది అరేంజ్ గ్రహమో, అ౦గారకమో! 
నాతో నేను, నాకు నేను 
నన్ను నేనే రమిస్తూ 
కామిస్తూ, శ్రమిస్తూ 
ధుపమై దహిస్తూ
జ్యోతి లా వేలుగుతానని,
బ్రమరిస్తూ, బ్రమిస్తూ 
కదిలి పోతుంటే, కరిగి పోతుంటే 
కలల పై దుప్పటి లాగేయండి 
తప్పేం లేదు..భూమి పై నడవడం కొత్త కాదు
పాకడం అంత కంటే పాత విద్యే
మరో సారి నేర్చుకొంటాను
మీలో ఒక్కడి నై ఇంకో సారి ఓడి పోయి నిలుస్తాను" 

Thursday, January 21, 2016

ప్రశ్నలు లేని సమాధానం

మీ ప్రశ్న లకు నా దగ్గర సమాధానం లేదు.
మీరు చేయాల్సిందల్లా
నా సమాధానానికి ప్రశ్నలు వేదుక్కోవడమే
ఎందుకలా అంటే..
సమాధానం అదే ఉంది
ప్రశ్నలే  మారుతున్నాయి 

Sunday, September 14, 2014

జన్మ దిన ఆశిస్సులు

మిత్రుడు, గురుతుల్యుడు..నరేంద్ర గారు అందించిన శుభాకాంక్షలు

క్రొంగొత్త ఊహ ప్రతి ఉషోదయమై

సాధించ దాహమది మహార్ణవమై
సాగేటి దారులవి యశోమయమై 
మనం తనువులు రెండు నిరామయమై 
వర్ధిల్లు మిత్రమా ‘విన్స్పైరు’ మయమై
స్థిత ప్రజ్ఞత కలిగి కృష్ణ వంశీయమై 
జన్మదిన శుభాకాంక్షలు మిత్రమా..

Tuesday, December 31, 2013

డైరీలో ఒక రోజు

(పాత సంవత్సర౦ నాకు ఎన్నో జ్ఞాపకాలని మిగిలించింది. అందులో ముఖ్యమైంది. గొప్ప అవకాశం గా బావించింది, "చంద్రబాబు" తో కలవడం. అప్పుడు నేను రాసి పెట్టుకొనది.)

Neelayapalem Vijay Kumar నుండి అనుకోకుండా ఒక ఆఫర్. 
"నేను వెళ్తున్నా, నేను అక్కడే, వాళ్ళతోనే ఉంటాను. నీకు వీలుంటే చెప్పు, కొన్ని రోజులు మాతో ఉండొచ్చు." 
" సరే" అన్నాను కాని, అనుకోకుండా అప్పుడే ఆఫీస్ టూర్స్, మీటింగ్స్ పడిపోయాయి. 
మన జిల్లాకు వచ్చినప్పుడే కలుద్దాం, అనుకొన్నా, అదే టై౦ లో విజయ్ హైదరాబాద్ వచ్చేసాడు. 
మనది ఒక జిల్లా కాదు కదా, కరీంనగర్ అయిన, వరంగల్ అయిన ఓ.కే. అని ఎదురుచూస్తున్నా సమయంలో మల్లి విజయ్ నుండి కాల్...
"జగిత్యాల్" లో జాయిన్ అవుతున్నా వస్తావా..
"అంతకన్నానా.." అని అన్ని విదాలుగా రెడి అయిపోయా..
అనుకొన్న రోజుకి విజయ్ కి మాలి ఎదో మీటింగ్, ఆగిపోయం.
మరుసటి రోజు ..మల్లి కాల్ రేపోద్దునే బయలుదేరుదాం అని.
శనివారం సెలువు రోజు కలిసిరావడం, విజయ్ తో పాటు జగిత్యాల్ బయలుదేరా౦.
దారి పొడువునా నా ప్రశ్నలే,
"అన్నయ్య, తెలంగాణా లో ఎలా ఉంది."
"మెదక్ లో ఎక్కడెక్కడ ప్రయాణం ఎలా జరిగింది."
"అసలు ఏమి చెపుతున్నారు"
"ఆదిలాబాద్ లో, నిజామాబాద్ లో ఎలా ఉంది"
సమాధానాలు, విశ్లేషణలతో బస్సు జగిత్యాల్ శివారులో చేరింది..
ఆశ్చర్య పోవడం నా వంతు అయ్యింది. జగిత్యాల్ లో చాల కష్టం అన్నారు.,అపెస్తామన్నారు.
కాని ..అక్కడ బస్టాండ్ చుట్టూ, హైదరాబాద్ వెళ్ళే రోడ్డు మొత్తం జనాలతో నిండి పోయింది.
బాబు మాట కోసం ఎదురుచూస్తున్నా జనాలు. సామాన్య జనాలే మైకు లో మాట్లాడుతూ,ఆసాధారణ చైతన్యం చూపిస్తూ అనేక ప్రశ్నలు, కోరికలు, కోపాలు, తమ శాపాలు చెపుతు .. ఒక నిజమైన ప్రజా సభ జరుగుతోంది.
ఆ మరుసటి రోజు విజయ్ గ్రూప్ లో సభ్యుడిగా బాబు అడుగు వేనేకే అడుగు వేస్తూ నడిచే అవకాశం, పేపర్లో చదివిన దానికన్నా చురుగ్గా, జనాల్లో కలిసిపోతూ, తనను చూసి stun అయి నిలపడి పోయిన వాళ్ళని కూడా పలకరిస్తూ, పొలాల్లోకి, దుకనాల్లోకి, వెల్డింగ్ షాప్ లోకి, బిది ఖర్కనా ల్లోకి చొరవగా చేరిపోతు, వాళ్లతో మాట్లాడుతూ ...
"ఏంటి అన్నయ్యా ..సెక్యురిట ప్రాబ్లెం లేదా, ఇంత కలిసి పోవడం ఏంటి "
"తన కున్న ఇమేజ్ అతన్ని గొప్పవాడిగా అందరికి దూరం చేస్తుంది, అందుకనే పోలిస్ డ్రెస్ ఉన్నవాళ్లు తన ముందు లేకుండా చూసుకొని అందరితో కలిసి పోతున్నాడు ..., ఇప్పుడు అది తప్పదు  కూడా "
మద్యలో చిన్న రెస్ట్లు, మల్లి నడక" అర్థరాత్రి పుట కూడా అడువులలో, శివార్లలో నడక ..
"అక్కడే ఆగిపోవచ్చు కదా, ఇంట రాత్రి వేల ఇలా గుట్టల వెంబడి నడవడం ఎందుకు"
" తెల్లారి నడక మొదలు పెట్టగానే గ్రామనికి దగ్గర ఉండాలని"
అమ్మో చాల అంది ప్రనలికే ..
" అవును, అది బాబు క్రమశిక్షణ"


ఆ రోజు బాబు గారితో నాలుగు మాట్లాడే బాగ్యం.
నేను: (నన్ను నేను పరిచయం చేసుకొని): సార్ నేను కరీంనగర్, వరంగల్ లో దాదాపు ఇరవై వేల రైతు లతో ప్రాజెక్ట్ చేస్తున్నాం. నాలుగు సొసైటి లు గా ఏర్పడ్డాము. మీకు వారితో కూర్చొని మాట్లాడితే బాగుంటుంది అనుకొంటున్నాo. మీకు విలు ఉంటుందా.?
బాబు: రైతులతో మీటింగ్ జమ్మికుంట లో ప్లాన్ చేసారు. విజయ్ తో మాట్లాడండి.
నేను: సరే సార్.. జమ్మికుంట లో ధర్నా ఉంటుందంటున్నారు. రైతు ల మీటింగ్ అయితే ఇంకా అనేక విషయాలు మాట్లాడొచ్చు. నీటి గురించి, ఫెర్తిలైసర్, విత్తనాలు అనేక అంశాలు ఉన్నాయి..
బాబు: అలా అయిన బానే ఉంటుంది. విజయ్ గారు.  (ఆయన్ని పిలిచారు) 


విజయ్: సార్
బాబు: రైతుల తో మీటింగ్ ఆలోచన బానే ఉంది. మీరు పెద్దిరెడ్డి గారితో, ఎర్రబల్లి గారితో మాట్లాడండి.
విజయ్: సరే సార్.
నేను: నేను మీ హయం లో "వాటర్ vision" పై పని చేసాను. అందులో అన్ని రంగాలకు కావాల్సిన నీటి అవసరాలు, పంపిణి, అందుకు తగ్గ ప్రణాళిక లు అన్ని జిల్లాలలో మీటింగ్ లు పెట్టి తాయారు చేసాం. తరువాత వచ్చిన ప్రభుత్వాలు, లేదా అధికారులు సగం ఆచరణలో పెట్టిన ఇప్పుడు విద్యుత్తు, వ్యవసాయ, నీటి సమస్యలు ఉండేవి కావు సార్
బాబు: అవునా..అప్పుడు పని చేసారా?? అయినా ఇవన్ని రైతులకు అర్థం కావు. ఏం చేస్తాం.??
అప్పుడే పెద్దిరెడ్డి గారు ఆయనతో ఎదో మాట్లాడాలని రావడం.. నేను వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. (పెద్ది రెడ్డి వచ్చినాక, "
ఈయన వరంగల్ లో రైతు లతో పని చేస్తారట.., రైతలతో మాట్లాడడానికి ఎదో ఒక రోజు చుడండి. అంటూ నన్ను ఆయనకు పరిచయం చేసారూ కుడా),


అలా ఆ పాదయాత్ర మత్తులో ఉండిపోయాను..ఆ రోజు రాత్రి విజయ్ తో మాట్లాడుతూ..
".... మరన్నయ్య కర్చులు".
"ఎవరి ఖర్చులు వారివే"
" అంటే మీ ఖర్చులు ??:
" డిజిల్, కొన్ని సార్లు  భోజనాలు ఖర్చులు మావే"
...మిమల్ని, మీ పార్టి ని, , మీ లిడార్ ని మెచ్చుకోవచ్చు...
"ఇలాంటి లిడర్ ని మిస్ అయిపోయామని మన వాళ్ళు కచ్చితంగా గుర్తిస్తారు..
ఇప్పుడు గుర్తించకపోతే, మన దురద్రుస్తాన్ని చరిత్ర గుర్తిస్తుంది "
---- అయన జన ప్రలోబ నేత కాలేదేమో, కాని జనం కోసం "విజన్" కలిగిన ఏకైక నేత"
---- ఈ రోజు విశాక సముద్ర తీ రానా, జన సముద్ర౦ తో బా బు పద యాత్ర ముగింపు వేడుక రాష్ట్ర ప్రజా ఆలోచనలను మరింత విమర్శనాత్మకంగా ముందుకు సాగాలని ....
చంద్రబాబుకి, పార్టి వారికి అభినదనలు

Wednesday, November 27, 2013

వదలని JK “ముందున్న జీవితం”

 “ఈ రోజు నుండి దేవుణ్ణి నమ్మదల్చుకోలేదు.!”
సాయంత్రం పరివార్ ధాబా కు వెళ్తూ ఎదో ఎవరో అమ్మయిలగురించి సరదాగా మాట్లాడుతూ వెళ్తున్న మా మిత్ర త్రయం తో పూర్తి అసందర్భంగా, అసంకల్పితంగా నేనన్న మాట. 
“ఏంట్రా ఏమన్నావ్??
...
“అయితే మాకేంటి..ఇప్పుడెందుకు సడన్ గా గుర్తొచ్చింది.!”
....
“అవునన్నా! కాలేజ్, హాస్టల్ వదిలేసి వెళితే, ఎలా ఉంటామన్నా?? జాబ్ లో బిజి అయిపోవడం.....” శ్రికరన్న తో శ్యాం ఎదో మాట్లాడుతూ ఉన్నాడు..నేనన్న మాటనే కాదు, నన్నే పట్టించుకోవడం మానేసారు.. నడక సాగుతూనే ఉంది.! 
అవును.., అప్పుడెందుకు అలా అన్నాను.! ఏమి ఆలోచిస్తు ఉండుంటాను ??
అవంచనియంగా ఆ క్షణం లో అన్న కుడా ఇప్పుడు తెలుస్తోంది, ఆ క్షణం గొప్పతనం.!

---------------------

మనలో మన ఆలోచనలలో కలిగే మార్పులకు ఒక “ఇండికేటర్” కావాలంటే దొరకదేమో ! అది మెల్లిగా, అతి మెల్లిగా, చాల నిదానంగా మొదలవుతుందేమో.! కాని అందులో ఎదో ఒక క్షణం అంతటికి కారణభూతమై నడిపిస్తుంది.
అలాంటి క్షణం ఏదైనా చెప్పలంటే నేను ముందు చెప్పిన క్షణా౦. అందుకు ఉసిగొల్పిన కొన్ని కారణాలు..
అవి నిజానికి డ్రమాటిక్ కాకపోవచ్చు..కాని నాకు సంబంధించి నా జీవిత గమనానికి పెద్ద మార్పులు..

------------------
చినప్పడినుంది పుస్తక౦ అంటే వ్యామోహమే.! స్కూల్ పుస్తకాలు కాదు..కథల పుస్తకాలూ.  అరటి పండ్ల ను చుట్టి తీసుకొచ్చిన పేపర్ కూడా చదివెంత పిచ్చి ఉండేది చినప్పుడు. హాస్టల్ వదిలి, హాలిడేస్ లో ఇంటికి వెళ్ళగానే పాత పేపర్ కట్టలు ముందు వేసుకొని, అందులో కథలు (ఈనాడు మూడో పేజిలో వచ్చే బొమ్మల కథ, కార్టూన్లు, సండే వచ్చే ఇది కథ కాదు లాంటివి) చదివే వాడిని..అప్పట్లో సుల్తానాబాద్ లోని (కరీంనగర్ జిల్లా), శాఖ గ్రంథాలయం లో పిల్లల పుస్తకాలు మొత్తం చదివేసాను.
అలా ఏది పడుతూ అది చదువుతున్న సమయం లో, కథ ల పుస్తకాలు దాటి సీరియస్ పుస్తకాలు చదవాలని అనిపించేట్టు చేసింది “ముందున్న జీవితం”.
బి.ఎస్సి.(అగ్రికల్చర్) మూడో సెమిస్టర్ చదువుతూ, రెండో సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తున్న టైం లో, అప్పటికే ఉన్న గ్రేడ్ పాయింట్ పెంచుకోవాలని
, చదవడానికి తెగ ప్రయత్నిస్తున్న కాలం లో, ఈ పుస్తకం ఒక మిత్రుని ద్వార దొరికింది. పుస్తకం కోఠీ లో తీసుకోని, రాజేంద్ర నగర్ వచ్చి మొదలుపెట్టి చదువుతూ ఉండిపోయాను. ఒక్క రోజు కాదు, ఒక వారం. రేపు పరిక్షలు అన్నరోజు వరకు.    
మొదటి కొన్ని పేజీలు తిప్పగానే అర్థం అయింది, “ఇతన్ని అర్థం చేసుకోవాలంటే మనల్ని మనం (బుర్రలను) పూర్తిగా ఖాలీ చేసుకొని చదవడం మొదలు పెట్టాలని”. ఒక పేరా చదవడం, ఆ తరువాత ఆలోచనలలో మునిగిపోవడం, ఆశ్చర్యపోవడం, మల్లి అలోచ్చించడం, ఒక నిర్ణయానికి రావడం, మల్లి చదవడం..
మిగితా పుస్తకాలలో ఉన్నది, జిడ్డు కృష్ణముర్తి పుస్తకం లో మాత్ర౦  కనపడనిది..,”సూత్రాలు, సూక్తులు, మంచి మంచి సలహాలు”..అవును, అతని పుస్తకాలలో మిగితా గురువులు చెప్పే సూత్రాలు, సూక్తులు ఉండవు. (నాకు అర్థం అయ్యింది, ఆ తరువాత నన్ను అత్యదికంగా ప్రభావం చేసింది, అదే!).  జిడ్డు కృష్ణమూర్తి ప్రతి ప్రశ్న కు సమాధానం నిన్నే వెతుక్కోమంటాడు. నీకు సమాధానం దొరకడం విలు కాకపొతే, మనం ఇద్దరం కలిసి ప్రయత్నిద్దాం అంటాడు. అల వెతికే క్రమం లో పై, పై పొరలు తొలిగిపోతుంటాయి.  ఒక దేశం, మతం, ప్రాంతం, చుట్టూ ఉన్న సమాజం ఎప్పుడో ఏర్పరిచిన మాయ చట్రాలు ఎవైన ఉంటె అవి దాటి ఆలోచించేలా మనకు తోడ్పడుతాడు. సత్యాన్వేషణ లో అసలైన దారి చుపెడతాడు. సమస్య లకు, సంక్లిష్టాలకు, అనుమానాలకు మనం గురువులను, సమాదాన పరిష్కారాలను చుపెవారి కోసం వెదుకుతూ ఉంటాం. కాని వాటిని నీలో సృస్టించు కొన్నది నివే కనుక, నీకు నివే గురువు అయి సమాధానం వేడుక్కోవాలంటాడు. అందుకని సమస్యలతో, నీతో, నీ పక్కవల్లతో, నీ స్నేహితులతో, బంధువులతో, మన ఆశలతో, వారి ఆశలతో ఉన్న బందాలను అర్థం చేసుకొంటే ఈ క్లిష్టత తోలిగిపోతుందంటాడు.   

సత్యాన్ని అన్గికరించకపోవడమే “భయం” అని చదవగానే, నాలో ఉన్న ఎన్నో భయాలు తోలిగిపోవడం మొదలయింది. భయాలకు మనం వేసుకొన్న ఎన్నో ముసుగు లు (అందులో స్వర్గం, నరకం, దేవుడు కుడా ఉన్నాయి) కనపడడం మొదలయింది.   
మనలో ఉన్న జ్ఞానం, అనేక జ్ఞాపకాల సమాహారం. చదువుకొన్నది, చూసింది, మన మతం మనతో చెప్పింది, మన దేశం గురించి మనం విన్నది, మన పెద్ద వారి నుండి మనకు వచ్చింది, ఆచారాలతో పాటు వచ్చింది..ఇలా అనేకం. ఇవే మనకు ముందుండి మనల్ని నడిపిస్తాయి. కాకపొతే మనకు ఎదురయ్యే కొత్త, కొత్త సవాళ్ళకు, పాత సమాధానాలే ఇవ్వి చుపగాలుగుతాయి. ప్రతి సమస్యను మన జ్ఞాపకాలతో, అనుభవాలతో ముడిపెడుతూ, అలవాటైన పద్దతిలోనే పరిష్కరించటానికి చూస్తుంటాం. కాని సమస్య లోనే, ఒక కొత్త సమాదానం ఉందేమో, కొత్త దారిలో వెడితే ఎలా ఉంటుందో, మన ఈ సమస్యలకు పాత అనుభవాల ముసుగులు ఎలా అడ్డం పడుతాయో అలోచిన్చుకోమ౦టాడు.
ఇది ఇప్పుడు నాకు కలిగిన అభిప్రాయం. అదే అభిప్రాయం ఎల్లా కాలం ఉండాలని తను చెప్పలేదు. అసలు తను చెప్పింది మాత్రమె కరెక్ట్ అని అనలేదు. మనల్ని ఆలోచించుకోమన్నాడు.
---------------------

అలా జిడ్డు కృష్ణమూర్తి పుస్తకం ” ముందున్న జీవితం” (లైఫ్ ఆహేడ్ అనే ఇంగ్లిష్ పుస్తక అనువాదం), నా ఆలోచన విధానాలను మార్చింది. అన్ని విషయాలలో  నాదైన సమాధానం వేదుక్కోవడానికి ఉపయోగపడింది. అవి కచ్చితంగా నా జీవన విధానం లో మార్పులు తీసుకువచ్చింది. దేవుడు గురించి ఆలోచించటానికి ఎక్కువ రిసెర్చ్ చేశాను, దొరికిన పుస్తకాలూ చదివాను. నేన్నిన్ని రోజులు “దేవుణ్ణి” నమ్మడానికి గల కారణాలను ఒక సారి పరిశీలించాను. అవి అన్ని పూర్తీ తప్పు కారణాలని అర్థం అయ్యింది. నాకు మరో కారణం దొరికేవరకు అన్వేషిన్చాలనుకొన్నాను. అలా అదే ధ్యాసలో ఆలోచిస్తూ, అప్పుడు ఆరోజు సడన్ గా అలా నిర్ణయించుకొన్నాను. అప్పటినుండి ప్రతి ఒక్కటి కొత్తగా కనిపించడం మొదలయింది. చాల వాటి మిద భయం పోయింది. నా వ్యక్తిత్వ నిర్మాణానికి, అది బయట వారికి వ్యక్తీకరించే పద్దతి మారింది.


ఆ రోజు నుండి ఇప్పటికి ఆ పుస్తకం నన్ను వదిలిపోలేదు. నేనే కాదు, నా ద్వార వెళ్ళిన ఎంతో మందిని అది వదిలి వెళ్ళదు.