Friday, June 28, 2013

Beautiful Butterfly - మన లో సీతాకోక చిలక

(చెట్ల ఆకుల అడుగునో, కాండం లోపలో ఎక్కడో పెట్టబడిన గుడ్లు పొధగపడి గుంపులు, గుంపులు గా లార్వలు పుట్టుకొస్తాయి. రక, రకాల రంగులు, వాటిపై వెంట్రుకలు,   కొన్ని గూని నడక తో (సెమి లుపర్ అంటారు), గంగాలి పురుగులు గా మనకు ఎక్కువగా కనపడి, కంపరం కలిగిస్తుంటాయి. ఆకులను తి౦టునొ, కాండం పై, పుష్పాల పై, మొగ్గల పై రంద్రాలు చేసి వాటిని తింటూ పెరుగుతాయి...
...అలాంటి లార్వలన్ని అదే జీవితమని ఆగిపోతే..)

ఒకసారి, ఒక గొంగడి పురుగు కి కొత్త అనుమానం వచ్చింది. అదే సృష్టి రహస్యం అనుకోని అన్ని లార్వాలని సమావేశ పరిచి తన భోదన ప్రారంబించిది. "ఈ సృష్టి మన కోసమే పుట్టింది. మనం తినడానికే చెట్లు మొలుస్తున్నాయి, వాటికి అకులు పెరగడం మన కోసమే, వాటికీ పుట్టే మొగ్గలు, పువ్వులు, కాయలు మనకోసమే.. " అని వాదించింది.
అప్పటి నుండి లార్వలు తామే సృష్టి లో రారాజు లు అనుకోవడం మొదలు పెట్టాయి. అవి తిరిగే ప్రాంతం ఆకులూ అడుగు భాగమో, చెట్టు మొదల్లో చూస్తూ..ఈ సృష్టి మొత్తం తమ కోసమే అని నిర్ధారణకు వచ్చాయి.
తమంత అందంగా కూడా ఎవరు లేరని విశ్వసించడం మొదలుపెత్తాయి. మెల్లి మెల్లిగా అవి తామే అనడరికన్నా అందమైన సృష్టి అని అభిప్రాయానికి వచ్చేసాయి. అవన్నీ కలిసి తమలో అందంగా ఉంటుందనుకొన్న "గొంగళి పురుగు" ని రాజు గా చేసాయి. అదే గొప్ప జీవితం అని ఉహించుకొంటు గడుపుతున్నాయి. లార్వల జీవితం ముగిసి కకున్ (ప్యుపా) గా మారగానే వాటన్నింటిని సమాధి చేయడం మొదలుపెట్టాయి.   అవి అల నాశనం కావడమే మోక్షం అనుకోన్నాయి. గొంగళి పురుగే విరదివిరుడి గా ప్రకటించబడింది. ఎక్కువ వెంట్రుకలు ఉన్న పురుగులే అందమైనవిగా ముద్రపడి పోయింది.
ఇవన్ని అలా కాలం గడుపుతుండగా ఒక కకున్ (ప్యుపా) సమాధి కాకుండా తప్పించుక్కోంది. ఆ కకున్ లో నిద్రాణంగా ఉన్న లార్వలో మెల్లి మెల్లిగా మార్పులు రాసాగాయి. పొరలు, పొరలు గా చీలి రెక్కలు గా మారసాగాయి. దానికే తెలియని కొత్త అవయవాలు పుటసాగాయి.
ఒక వారం వ్యవధి లో "తనలో తానె, తనకు తానె" మార్చుకో సాగింది. బయటి ప్రపంచానికి ఇది తెలియదు. బయట వారికి ప్యుపా అంటే ఒక కదలిక లేని, సరైన ఆకారం లేని, నిర్జీవ పదార్థమే..
అలంటి ప్యుపా ఒక రోజు తన పైనున్న "పెంకును" చిల్చుకొని సీతాకోక చిలుక గా మారింది. అప్పుడు దానికొక విషయం అర్థమైనది.
"తన అసలైన రూపం నేలపై పాకే గొంగళి రూపం కాదు.."అందమైన రంగులతో శ్రద్దగా డిజైన్ చేసినట్టున్న రెక్కలు, పొడవైన కాళ్ళు, పుల మకరందం తీసుకోవడానికి వీలైన శరీర ఆకృతి తనదని తెలుస్కోంది".
ఆనందంగా రెక్కలు చాచి ఎగిరింది. అప్పుడది మరో విషయం కనుక్కోంది. "ప్రపంచం చాల పెద్దగా ఉంది. చాల అందంగా ఉంది. చెట్లు, చేమలు, మొక్కలే కాదు, లోకం లో చెరువులు, సెలయేళ్ళు, పక్షులు, అందమైన జీవులు, కొండలు, కోనలు లెక్కలేనన్ని అనంతమైన ఆకాశంతో సహా.." లోకం పెద్దగ, కొత్తగా, చెప్పలేనంతా అందంగా ఉంది".

తానూ కనుక్కొన్న విషయం మిగితా లార్వలకు చెప్పాలని బయలు దేరింది. ఆ లార్వలకు ఈ సీతాకోక చిలుక కొట్టగా కనపడింది. "ఏంటి వెంట్రుకలు లేవు. వెంట్రుకలు లేకుండా సిగ్గనిపించాట్లేడా?? ఆకులూ తినకుండా బ్రతికి ఎం ప్రయోజనం?? చెరువులు, కొత్త లోకం అంటూ పిచ్చి, పిచ్చి గా మాట్లాడుతుంది ఏంటి?? " అంటూ దాన్ని అవమానించాయి. అనుమానించాయి. కొన్నైతే ఇలాంటి వాటిని బ్రతకనివ్వ కూడదు. చంపేయాలి అని కూడా ఆవేశ పడ్డాయి.
సీతాకోక చిలక ఏంతో చెప్పాలని  ప్రయత్నించింది. ఇలా ప్యుపా ల దగ్గరే ఆగిపోతే తన జాతికి మనుగడ కూడా ఉండదని చెప్పి చూసింది.   కనీసం కొన్నిటిని అయిన ప్యుపా ని దాటి రమ్మని ప్రాదేయ పడింది. అప్పుడు కొన్ని మెత్తపడ్డాయి. కొన్ని కొద్ది రోజుల్లోనే నమ్మాయి. మిగిలినవి మరికొన్ని రోజుల్లో నిజం గ్రహించాయి. నమ్మనివి నశించిపోయాయి..
"మనకు ఇప్పుడున్న దశ శాశ్వతం కాదు. ఇంట కంటే మంచి భవిష్యత్తు ముందుంది. ఈ రెండింటి మధ్యలో ముఖ్యమైన మరో దశ ఉంది. అందరు అక్కడే ఆగిపోతారు.  అది దాటి మున్డుకేల్లిన వారిదే ప్రపంచం. అప్పుడు ప్రపంచం వారికోసం కొత్త ద్వారాలు తెరుస్తుంది.
మనం ఎదిగే దశలో మన చుట్టు ఉన్న వారు, చుట్టూ ఉన్న పరిస్థితులు మనపై పొరలు కప్పుతూ ఉంటాయి. ఆ పొరల మధ్యలో ఉండిపోతే కకున్ దశలోనే మగ్గిపోతాం.
అందుకే కకున్ ని చిల్చుకొనే ప్రయత్నం చేయాలి. లార్వ ప్రతి అవయవం మర్చుకోనట్టు, మనల్ని మనం మార్పుకి సిద్దం చేసుకోవాలి. అవసరమైతే మన అలవాట్లను,   నమ్మకాలను, భయాలను, బలహీనతలను సమూలంగా మార్చుకోవాలి.
నీలో మార్పు జరుగుతునప్పుడు నిన్ను ఎవరు గుర్తించకపోవచ్చు. ఎదుటి వ్యక్తీ అంగీకారం నికప్పుడు అనిపించవచ్చు. నీలోని సీతకొక చిలక ను నివు బయటకు తీసి పైకి దుసుకేల్లినప్పుడు నికే గుర్తింపు అవసరం ఉండదు. అందుకే నిన్ను నివు తరచి చూసుకో. నీలో ఏ శక్తి దాగుందో, నీలోని ఏ కోరిక నిన్ను ఉన్నత స్థాయి కి తిసుకెల్తుందో, నీలోని ఏ గుణం నీకు కొత్త గుర్తింపు తెస్తుందో తెలుసుకో! అందుకు నిన్ను నివే చదువుకో."




( నరేంద్ర గారు చెప్పిన "Revalution" అన్న ఇంగ్లీష్ కవిత కి తెలుగు సుత్తికరణ.

Tuesday, June 25, 2013

మేము, మా స్కూల్ మరియు నిజాముద్దీన్

కొంచం పెద్ద పోస్టే ..కాని మా స్కూల్ మిత్రులు ఎవరైనా చదువుతారేమో నని మరి వివరంగా రాసా......
"కీసరగుట్ట లో 83-89 మధ్య చదువుకొన్న ప్రతిఒక్కరికి గుర్తిండిపోయే ఒక పేరు - నిజాముద్దీన్.

అప్పుడు కీసరగుట్ట సిటి కి దూరంగా ఉన్న ఒక గుట్ట ప్రాంత౦. అక్కడ మా స్కూల్, వేద పాటశాల, గుడి తప్ప మరేమీ ఉండేది కాదు. మేము దాదాపు గా నాలుగు జిల్లాల లోని (అంటే వంద కిలో మీటర్ నుండి ఆ పైన) మారు మూలా గ్రామాల నుండి వచ్చిన వాళ్ళమే. వేసవి సెలవల తరువాత వస్తే, మల్లి దసరా సెలవులకే ఇంటికి చేరేది, ఇంట్లో వాళ్ళను చూసేది. ఎంత గొప్ప స్కూల్ అయిన, అన్ని వసతులు ఉన్నా, మంచి టీచర్స్ ఉన్న అప్పుడది మొదట్లో మాకొక జైలు లాగానే కనపడేది.. 
1983 లో డిసంబర్ లో అనుకొంటా., కొత్త పి.ఇ.టి. గా స్కూల్ లో జాయన్ అయ్యారు. అంతకుముందున్న గౌస్ దగ్గర నుండి బాధ్యత తీసుకొన్నాడు. మేము అప్పుడే అయిదవ తరగతి లో చేరి అయిదారు నెలలు అవుతుంది. మాకు గౌస్ గురించి పెద్దగ తెలియదు.
కాని, నిజాముద్దీన్ మా స్కూల్ జీవితం లో చాల పెద్ద పాత్ర పోషించాడు....పూర్తీ వ్యాసం కింది బ్లాగ్ లో.....
http://keesaragutta.blogspot.in/2013/06/blog-post.html

Tuesday, March 19, 2013

నాకోసం నేనే దేవుడవుతా


నాలో నేనే సత్యం వెతుక్కొంటా
నాకు నేనే దాసోహం అంటా
నాకోస౦ నేనే గర్వపడతా
నాకు నేనే నౌకరవుతా
నాకు నేనే శిష్యువుతా
నాకు నేనే భక్తువుతా
నాకోసం నేనే దేవువుతా

Friday, February 22, 2013

జనాలు, మానవులు మరియు వారి హక్కులు

మానవులు అంటే ఎవరు..??
కటోర శిక్షణ తీసుకోని, కనీసం పది మందిని బాంబులతో పెల్చగాలిగి ఉండాలి..
ఎవరి డబ్బులతో, శ్రమ తో ఏర్పడిన వ్యవస్థ లలో (బడులు, మౌలిక వసతులు) సౌకర్యాలు పొంది, విద్య బుద్దులు నేర్చుకొని, కొత్త కొత్త పన్నాగాలు పన్ని, అమాయకులను తీవ్రవాద ఉచ్చులో లాగి నర మేధానికి ప్రణాళిక పన్ని, పని నిర్వహించాగాలగాలి
ఎదో ఒక సిధ్ధాంటానికి లోబడి, ప్రజాస్వామ్యాన్ని తిడుతూ కనీసం ఒకరినైనా చంపి ఉండాలి

..వాల్లే మానవులు, వారికే మనవ హక్కులు ఉంటాయి..సామాన్యులు, వీటికి ఏమి సంభంధం లేని మామూలు జనాలు ..జనం అనే లెక్క మాత్రమె..! విరు "సామ్యవాద ఉచ్చులో పడ్డ" మూర్ఖులు మాత్రమె, విరు మనుషులు కాదు. తివ్రవాదులు చంపడానికి, ప్రతీకారం తీర్చుకోవడానికి కొంత "నంబర్" కావలి. అందుకు ఉన్న జనాలు.., సామాన్యులు..వారు మనుషులు కాదు. "జనసామన్యుల్లారా మీకు ఇలా జరగాల్సిందే"..ఎవడో ఎక్కడో ఎదో చేసాడు.., ఒకడు మసీదును కూల్చాడు, ఎదో సాది౦చినట్టు జండా ఎగరేసాడు, ఎవడో రైలు కి నిప్పు పెట్టాడు, దైవం స్వర్గం లో తన బర్త్ రిసర్వ్ చేసాడు అని పొంగి పోయాడు. అందుకోసమే, అందుకు ప్రతీకారంగా నిన్ను చంపుతారు, నివు హిందువా, అయితే అలా జరగాల్సిందే.., ముస్లింవా, మీరు కూడా చావాల్సిందే, మరో మతమా అయినా సరే నువ్వు చావాల్సిందే.!!  దాన్ని అర్థం చేసుకోవాలి. నివు మారాలి, ఎంతగా అంటే "చచ్చేంతగా".. రక్తం మరుగుతున్న నిది తప్పని తెలుసుకోవాలి. ని అభిప్రాయం మడిచి మింగేయాలి.
మనవ హక్కుల కాపలా దారులు కవిత్వం రాస్తున్నారు. మొన్న అఫ్జల్ గురుని చంపినందుకు భాదతో, అది వాళ్ళ ఇంటి వాళ్ళకు చెప్పలేకపోయరనే దారుణ పరిస్తితులున్న ప్రజాస్వామ్యం పై, కోపం తో, పార్లమెంట్ ఆరోజు కులిపోలేదన్న భాదతో కుమిలిపోతూ కవిత్వం రాస్తున్నారు..
రేపు మరో సారి ఎవరనినా పట్టుకొంటే, అప్పుడు గుర్తోస్త్తాయి "మనవ హక్కులు" .. ప్రజాస్వామ్య సౌకర్యాలు అనుభవిస్తూ .."మెజారిటి, మైనారిటీ, పాత లెక్కలు, కొత్త కారణాలు, చెత్త సిద్దంతాలు, అపోహలు, ఆరోపణలు" అంటూ జనాలను విడగోడుతూ, అతివాదానికి కూము కాస్తూ తిరిగే సామాజిక వృద్దులు, అతిఅవకాష వాదులు కొత్త ముసుగులోని తీవ్ర వాదులు..
(నోట్: మనకు కనపడుతున్న ప్రతి మనవ హక్కుల కాపలదరున్ని అనలేదు.., మొన్ననే ఆంధ్రజ్యోతిలో కవితలు రాసిన మేధావే ..ఇంతటి గోస కు కారణం..అంతే  కాదు ఇది చదివి మనోభావాలు దెబ్బతిసుకొనే అందరికోసం)

Friday, January 25, 2013

"Nothing" is possible..

who said "nothing is impossible"..
"nothing" is possible.! here is the example...

గత కొన్ని రోజులుగా, నెలలుగా, సంవత్సరాలుగా మన ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, ఎం.ఎల్.ఎ లు, ఎం.పి లు ఇది నిరుపిస్తువస్తున్నారు. "తెలంగాణ" రావడం, పోవడం అనే మాయ మాటలతో కలక్షెపమ్ చేస్తూ.., డెల్లి ప్రయాణాలతో, విందు సమావేశాలతో కాలం గడిపేస్తున్నారు.

అది ఉద్యమం.., ప్రజలు, విద్యార్తులు తమంత తాముగా వచ్చి నిలబెట్టిన ఉద్యమం.అ ఉద్యమం ఉద్దేశ్యాలు, వాటి తప్పొప్పులు చర్చిన్చ్చేమో..కాని రాజకీయ నాయకులూ అవేమి చేయడం లేదు. ఉద్యమాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి మాత్రమె ప్రయత్నిస్తున్నారు. పడువులతో ఉద్యమం చేయడం అంటే ప్రజా ధనంతో, ప్రజలిచ్చిన అధికారం తో పబ్బం గడుపుకోవడమే.. తమకు వచ్చే ప్లస్సులు, మైనస్సులు లేక్కేసుకోవడానికి మాత్రమె వాళ్ళు చేస్తున్నది.

రోజంతా వార్తలు అవే, పొద్దున్న లేస్తే ఒకరిని ఒకరు తిట్టుకోవడం, అది ఒక ఉద్యమ స్పూర్తితో కాకుండా, రాజకీయ లబ్ది కోసం, ప్రజలను పక్క దారి పట్టించటం కోసం మాత్రమె..లెక్కలేని వార్త చానల్ లు, చిరాకు పుట్టించే అంకర్ ఎక్ష్ప్రెషన్, అరుచుకోవడమే అసలు వాదన.,

అసలు మన వాళ్ళు ఇంతకూ తప్ప ఎం పనిచేస్తున్నారు...! అందుకే అన్నది "nothing" కూడా మనకు సాధ్యమే...

Wednesday, January 23, 2013

దేవుడు, మతం మరియు కమల్

"నాస్తికులుగా మాట్లదకండి. ఊరంతా మంచివాళ్ళే ఉన్నారు. వాళ్ళంతా దేవుళ్ళే" -సత్యమే శివం
"దేవుడుంటే బాగుండు..దేవుడు లేదని నేనేక్కదన్నాను??" -దశావతారం.

పై రెండు సినిమాలకు కథ, స్క్రీన్ ప్లే కమల్ అందించాడు. దేవుడు , మతానికి సంభందించిన అనేక విషయాలను చక్కగా చర్చించిన సినిమాలు. ఎక్కడ దేవుడి పై గాని, భక్తుల పై గాని, మాతాల పై గాని అసందర్భ విమర్శ లేని సినిమాలు. అదే సమయం లో తర్ఖిక ప్రశ్నలు లేవనెత్తి చర్చిస్తాడు (దశావతారం లో శైవ. వైష్ణ మతాల మధ్య ఒక సమయం లో ఉన్న వైరం, దాన్ని మూర్ఖంగా నమ్మిన ఇద్దరు స్నేహితుల వైరం, అవి నేటి సమాజానికి ఎంత అనవసరం అయ్యయో, ఎలా కొట్టుకుపోయాయో చెపుతాడు, అలానే సత్యమే శివం లో ఇద్దరు భక్తులు -నాజార్, మాధవన్ మధ్య నడిచిన ఒక నాస్తికుని, కమ్యునిస్ట్ భావజాలం ఉన్న ఒక వ్యక్తీ, అతని లో వచ్చిన మార్పు, అదే ఇతరులను ప్రేమ గా చూసే గుణం, దాన్నే దైవం అని చెప్పే ప్రయత్నం)
కమల్ గొప్ప నటుడు మాత్రమె కాదు. ఒక గొప్ప వ్యక్తిత్వం, గొప్ప ఆలోచనలు గల వ్యక్తీ. ఆతను ఒక నటుడు గానే కాదు, ఒక కొత్త ఆలోచనలను ప్రభావం చేయగల వ్యక్తీ గా మన సమాజానికి ఏంటో అవసరం. ఇప్పుడు సినిమాని ఆపేయమని గొడవ చేస్తున్నది..ఒక మతం వాళ్ళు గా కాకుండా.., మతాన్ని అడ్డుపెట్టుకొని ప్రచారం పొందాలని చుస్తున్నవారిగా అర్థం చేసుకోవాలి. ఇలా సినిమా ని ఆపటం వాళ్ళ, జరిగే ప్రయోజనం ఏమి లేదు. చూసేవాళ్ళు కచ్చితంగా చూస్తారు. ఇప్పుడు అనేక సాధనాలు.  కమల్ కి, నిర్మాతలకి (తన కుటుంభానికి) అది ఆర్థిక నష్టం తెస్తుందేమో కాని ఆతను చెప్పాల్సిన విషయాన్ని కచ్చితంగా చర్చకు వస్తుంది.అదే అతని ప్రయత్నం కనుక, అతడు సినిమా కి ముందే ఆ పని చేయగలిగాడు.

Tuesday, January 22, 2013

మంచి తనం మించిన దొరకదు - 2 (సత్యం చెప్పే మాట)

"నమ్మండి నాస్తికులుగ మాట్లాడకండి, ఊరంత చాల మంచి వాల్లు ఉన్నరు, వాల్లంత దేవుల్లె" -సత్యమే శివం లోని సత్యం చెప్పే చివరి డైలాగ్.
అలంటి దేవుడే "కళ్యాణ సుందరం"..

మనుషులను ఇప్పుడు రెండుగా విడగొట్టి చుస్తే., చెడ్డ వాళ్ళు, మరియు అమాయకులు గానో., చేతగాని వాళ్ళు, లౌక్యం గల వాళ్ళు గానో మాత్రమె విభజిస్తాము. ఎందుకంటే మంచివాళ్ళు మనకు అమాయకుల లాగానో, లౌక్యం గా బ్రతకటం చేతకాని వాళ్ళుగా మాత్రమె కనపడుతారు. "మంచి తనం" మన మధ్యలో మాత్రమె తిరుగుతుంటే నమ్మశక్యం కాదు. 
"కళ్యాణ సుందరం" లైబ్రేరియన్ గా పని చేసి ఈ మధ్యే పదవి విరమణ చేసాడు. పది లక్షలకు పైగా "రిటైర్మెంట్ బెనిఫిట్స్" పొందాడు. అయితే అతని గొప్పతనం ఏంటంటే అందులో ఒక్క పైసా తన కోసం ఉంచుకోలేదు. మొత్తం దాన ధర్మాలకు ఇచ్చేసాడు. అలంటి వాళ్ళు చాల మంది ఉండే ఉంటారు అంటారా??? 
ఆయన మరో గొప్పతనం, ఎవరు అందుకోలేని మహోన్నత వ్యక్తిత్వం ఏంటంటే.. ఇంత వరకు తన జీతం మొత్తం, ఇప్పటి వరకు తనకు వచ్చిన ప్రతి పైసా, కష్ట పది పని చేస్తే వచ్చిన జీతం మొత్తం ఇలాంటి దాన ధర్మాలకు వినియోగించాడు. తన అవసరాల కోసం విడిగా హోటల్ లలో సర్వర్ గా పని చేసి సంపాదించాడు. అలా సర్వర్ గా పని చేస్తూ వచ్చిన డబ్బులు మాత్రమె తన కోసం వాడుకొన్నాడు.
ప్రపంచం మొత్తం లో ఇలా సంపాదన మొత్తం మంచి కార్యక్రమాలకు వినియోగించిన ఏకైక వ్యక్తీ, "కళ్యాణ సుందరం". U.N.O. ఇది గుర్తించింది. అమెరికాలోని ఒక  అతన్ని "మాన్ ఆఫ్ మిలీనియం" బిరుదును కొంత నగుదు ని అతనికి బహుకరించింది. మల్లి ఇతను ఆ బహుమతి మొత్తాన్ని(ఎంత..ముప్పై కోట్లే) చారిటి కే ఉపయోగించాడు. అతను "పాలం" అనే సంస్థ ద్వార సమాజ సేవ కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇప్పటికి రోడ్డు పైనో, ప్లాట్ ఫాం పైనో పడు కోవడానికి అతనికి ఎ భాధ ఉండదు. అలా ఉంటేనే అసలైన పేదల భాద తెలుస్తుంది అంతాడు. ఇండో-చైనా యుద్ధం మొదలైనప్పుడు మొదలైన ఈ సేవ కార్యక్రమాల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. రజినీకాంత్ ఇతన్ని "తండ్రి" గా దత్తత తీసుకొన్నాడు. అప్పుడు కాని పత్రికలకు ఆతను "వార్తా" కాలేదు.
ఉద్యోగి గా, జీతం కోసం, జీతం పెరగడం కోసం, అందుకు చేసే బంద్ ల కోసం, పే కమిషన్ లెక్కల కోసం, అధికారం కోసం, ప్రమోషన్ కోసం, అహంకారం కోసం (ప్రభుత్వ ఉద్యోగి అనే), అవినీతికి దొరికే అవకాశం కోసం పనిచేయడం ఇప్పటి లౌక్యానికి, తెలివికి మనం ఇచ్చే నిర్వచనం. కాదంటారా..
కాదనండి..చుట్టూ చుడండి. ఇలాంటి వాళ్ళు ఎందఱో ఉన్నారు. మంచి తనం ను మించినది లేదనే సిద్దాంతం మిద నిలబడే, బ్రతికున్న దేవుళ్ళు.. హోటల్లో కాన పడే సర్వర్ కావచ్చు, రిక్షా నడిపే కార్మికుడు కావచ్చు, రోడ్డు పక్కన అడుక్కొనే బిచ్చగాడు కావచ్చు, రోడ్డు మద్యలో నిలబడ్డ ట్రాఫిక్ పోలిస్ కావచ్చు, కార్లలో తిరిగే దొరబాబు కావచ్చు.. మంచితనం పంచుతూ తిరుగుతూ ఉండొచ్చు. అనుమానపు కళ్ళద్దాలు ఉంటేనే ఈ లోకం లో బతక గలమనే పిరికి తనం వదిలిన్చుకొంటే..లోకం మరింత అందంగా.., కొత్తగా కనపడుతోంది.  ఇదే "సత్యమే శివం" సూత్రం.
  http://www.hindu.com/thehindu/mp/2003/04/23/stories/2003042300060300.htm