Thursday, August 25, 2011
ఇది కూడ నేనె!!!
అశల చిగుర్లకి పచ్చని రంగు వేసి
పాత కలలకు కొత్త చొక్కా తొడిగి
అంతులేని దైర్యం అప్పుగా తెచ్చుకొని
మాటలకు అరువు పదాలు అతికించి
అర్థం కాని కొత్త కథల నేడు నేను..,
భయానికి అచ్చమైన అర్థంగా
అమాయక విశ్వాసాల ప్రతిరూపంగ
మొలకెత్తని నాటు విత్తనముల
సొంత సంతోషాల, చిన్న చిన్న ఆనందాల
ఊరి మట్టి తో నా సొంత్త పేరు లా నాడు నేను
Monday, June 27, 2011
కాపీ మాట
నేను నీ ప్రేమ లో మునిగిపోయాను. ఎంతగా అంటే ఈ ప్రపంచాన్ని పట్టిచుకోనంత, నీ తో సహా ...
అర్థం కాలేదా.., నేను నీ కంటే, నీ పై ఉన్ననా ప్రేమనే ఎక్కువ ప్రేమిస్తాను.
I love you so much... so much so that, nothing can matter to me..,not even you..
అర్థం కాలేదా.., నేను నీ కంటే, నీ పై ఉన్ననా ప్రేమనే ఎక్కువ ప్రేమిస్తాను.
I love you so much... so much so that, nothing can matter to me..,not even you..
Thursday, June 23, 2011
సత్యమే శివం
దోచుకున్నవాడు దొంగ కాదు., దోచున్కున్నది దాచుకోన్నవాడు దొంగ కాదు. దొంగతనంగా దాచుకొన్నది పంచుకోన్నవాడు మాత్రమే దొంగ. ఇప్పుడు కోతగా లెక్క పెడుతుంటే , ఇన్నాళ్ళు లెక్క చెప్పని వాడిది తప్పు లేదు. భారత ప్రబుత్వానికి బాద్యత లేదు. అపారమైన నల్ల ధనం, రాజ భోగాలు. మీ నమ్మకం విలువ ఏంటో ఇప్పుడైనా తెలుసుకోక పోతే, ఇక నమ్మకం అనే దానికి విలువ అక్కర లేదు, మన నమ్మకాన్ని అసలు మనం నమ్మనక్కరలేదు. ఎవరో చెపితే, ఎవరో అనుసరిస్తే, మనవాళ్ళందరూ నమ్మితే మనం నమ్ముదాం.
Thursday, June 2, 2011
ఆదివారం రంగోలి
AG కాలేజీ, రాజేంద్ర నగర్, బి హాస్టల్ లో ...టిఫిన్ అయిపోతుందంటే ఎ ఎనిమిది, తొమిది గంటలకో లేచేది, సండే మాత్రం పొద్దున ఆరు గంటలకే లేచి, సెవెన్ హిల్స్ లో టీ తాగి, టివి రూం లో సెటిల్ అయ్యి DD లో (దూర దర్శన్ - అదృష్టం బాగుండి, అ ఒక్క ఛానల్ మాత్రమే వచ్చేది, ఇది 94-98 లో మాట) రంగోలి చూస్తుంటే ఆహ, ఆ మత్తు ఆ వారమంత ఉండేది. పాత హిందీ పాటల పరిచయం నాకు అక్కడే. ఎన్ని కాస్సేట్ట్స్, ఎన్ని సాంగ్స్... ఒక్కో సాంగ్ రోజుకు పది సార్లు విని, ఇరవై సార్లు పాడుకోని, వందల సార్లు ఆహ అనుకోని..ఆహ! పాటల్ని ప్రేమించి, అనుబవించి, పాటల్నోని ప్రేమని అనుబవించడానికి, అమ్మాయిల్ని ప్రేమించి, ఓహో!! అప్పుడప్పుడు సాయంత్రం హాస్టల్ పైన, పార్టీలలో విరహ గీతాలు, శ్యాం గాడి తెలుగు ప్రేమ గీతాలు (కొందరి కోరిక మేరకు), వాటిలో నంజుకోవడానికి గిల్బీస్ గ్రీన్ లేబిల్. ఇదంతా గుర్తుకు వచ్చి గూగుల్ లో వెదికితే మంచి పాట దొరికింది. క్రింద ఇచ్చిన పాట క్లిక్ చేసి చూడండి, మీరు ఎంజాయ్ చేస్తారు.
http://www.youtube.com/watch?v=lhxG1NMZITI
http://www.youtube.com/watch?v=lhxG1NMZITI
Friday, June 4, 2010
ఎప్పట్లానే
ప్రేమంటే ...
ఆశ అన్నానీను ...అత్యాస అన్నావు నీవుఆకర్షణ అన్నాను ... ఆకలి అన్నావు నీవు
మధురం అన్నానేను ..మోసం అన్నావు నీవు
ఆరాధన అన్నాన్నేను ...అంతానటన అన్నావు నీవు
చివరగా ...
ప్రేమ పిచ్ఛి అన్నావు...కచితంగా అదే అన్నా నేను .
అలా అన్నావని.., అంటావేమో ననినాకు నేనే అనుకోని .. లోలోని కుమిలి
పెదవి దాటని మాటతో పిరికి వాణ్నయ్యను
గుండె నిండా పిరికి తనం నింపుకున్న నాకు
"ప్రేమ" కింక చోటెక్కడ
ప్రేమ కు ప్రేమే ముగింపని
సర్టి చెప్పుకొని కాళ్ళు తని పడుకొన్నాను
కలలకు దుప్పటి కప్పేసాను ..
.........................ఎప్పట్లానే.
Monday, April 26, 2010
అప్పుడెప్పుడో ....
Wednesday, July 29, 2009
పది సంవత్సరాలు అయిపోయాయి, కాలేజీ వదిలి. దశాబ్ధములో ఎంత మార్పు.
ఎ జి కాలేజీ, రాజేంద్ర నగర్, బి - హాస్టల్ ఫ్రెండ్స్ పార్టీ లో కలిసి నవ్వుకొని, ఆ రాత్రంతా తనివీ తీర (జ్ఞాపకాలని) తాగిన ఆ రోజు గుర్తుకోసం..., (తెల్లారే ఇంటినుంచి వచ్చిన ఫోన్ తో గుర్తోచిన వాస్తవం తో కలిపి)
కిషోర్ కుమార్ గొంతు, శాయిరిలా సోగుసులు
ఊహల మేడలు, కలవరింపు కలలు
ప్రతి మత్తులో గమతులు
అన్నింట్లో శివం, సుందరం
కాని...
అదంతా క్రీస్తు పూర్వం
పునర్జన్మ ఉంది.
అర్థాలు మారిన ఆశలు
విసిగిస్తున్నఆలోచనలు
బాధ్యతా ముసుగులో కావలసినంత బదకం
పారిపోయేందుకు కావలసినంత తెలివి
దుమ్ముపట్టిన కాసెట్సే,
మూగా బోయిన స్పీకర్లు
పిల్లల ఆటలో చిరిగిపోయిన గుర్తులు
బాస్ కోసం, బన్నీ కోసం, ఇంటి కోసం, చంటి కొసం,
...మల్లి పుట్టలేమో మన కొసం
ఎ జి కాలేజీ, రాజేంద్ర నగర్, బి - హాస్టల్ ఫ్రెండ్స్ పార్టీ లో కలిసి నవ్వుకొని, ఆ రాత్రంతా తనివీ తీర (జ్ఞాపకాలని) తాగిన ఆ రోజు గుర్తుకోసం..., (తెల్లారే ఇంటినుంచి వచ్చిన ఫోన్ తో గుర్తోచిన వాస్తవం తో కలిపి)
కిషోర్ కుమార్ గొంతు, శాయిరిలా సోగుసులు
ఊహల మేడలు, కలవరింపు కలలు
ప్రతి మత్తులో గమతులు
అన్నింట్లో శివం, సుందరం
కాని...
అదంతా క్రీస్తు పూర్వం
పునర్జన్మ ఉంది.
అర్థాలు మారిన ఆశలు
విసిగిస్తున్నఆలోచనలు
బాధ్యతా ముసుగులో కావలసినంత బదకం
పారిపోయేందుకు కావలసినంత తెలివి
దుమ్ముపట్టిన కాసెట్సే,
మూగా బోయిన స్పీకర్లు
పిల్లల ఆటలో చిరిగిపోయిన గుర్తులు
బాస్ కోసం, బన్నీ కోసం, ఇంటి కోసం, చంటి కొసం,
...మల్లి పుట్టలేమో మన కొసం
Subscribe to:
Posts (Atom)
